అనందీబెన్ పటేల్ కు సమన్లు జారీ చేసిన ప్రధాని మోడీ Angry over chaos at Amit Shah's rally, Modi summons Anandiben

Angry over chaos at amit shah s rally modi summons anandiben

narendra modi, modi, pm modi, prime minister narendra modi, anandiben patel, anandiben, modi summons anandiben patel, pm modi-anandiben, former gujarat chief minister, former gujarat cm anandiben patel, amit shah, bjp, bhp president amit shah, rally, bjp rally, bjp rally surat, patidars, gujarat patidats, patidar community, gujarat patidars, gujarat news

Anandiben Patel was present on the dias when young Patidars disrupted the rally which was called to show that the BJP still enjoyed the support of the Patel community.

అనందీబెన్ పటేల్ కు సమన్లు జారీ చేసిన ప్రధాని మోడీ

Posted: 09/11/2016 03:37 PM IST
Angry over chaos at amit shah s rally modi summons anandiben

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సొంత రాష్ట్రంలో బీజేపికి ఎదురవుతున్న విపత్కర పరిణామాలపై ఇప్పటికే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ గుర్రుగా వున్న నేపథ్యంలో తాజాగా జరిగిన పరాభవ పరిస్థితులతో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అయితే ఈ పరిణామాలపై అటు పార్టీ జాతీయ అధ్యక్షుడు అందించిన నివేదికను అనుసరించారో లేక.. తనకు అందిన సమాచారం మేరకో తెలియదు కానీ మొత్తానికి గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి అనందిబెన్ పటేల్ ను ఢిల్లీకి పిలిపించి మరీ అమెను వివరణ ఇవ్వాల్సిందిగా సమన్లు జారీ చేసినట్లు వార్తలు జాతీయ మీడియాలో కోడై కూస్తున్నాయి.

త్వరలో రానున్న అసెంబ్లీ ఎన్నికలలో మళ్లీ తామే అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీజేపి.. అందుకు అనుగూణంగా తమ బలనిరూపణకు సిద్దమయ్యారు, ఇందులో భాగంగా ఇటీవల తీవ్ర నిరసనలు వ్యక్తం చేసిన పాటీదార్ల మద్దతు కూడా తమకే వుందని నిరూపించుకునేందుకు చేసిన యత్నంతో భంగపాటు ఎదురైంది. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్న ఈ ర్యాలీ విఫలం కావడంతో అసలేం జరిగిందన్న విషయమై తనకందిన సమాచారం మేరకు అనందిబెన్ పటేల్ ను ప్రధాని ఢిల్లీ పిలిపించి వివరణ కోరుతూ సమన్లు కూడా జారీ చేశారని తెలుస్తుంది.

కొత్తగా అధికారం అందుకున్న రాష్ట్రాలతో పాటు బీజేపి సత్తాను గత రెండు దశాబ్ధాలుగా చాటుతున్న గుజరాత్ లో తప్పక అధికారంలోకి రావాలని అరెస్సెస్ అదేశించింది. దీంతో. పాటీదార్లలో తమకు ఉన్న బలనిరూపణ కోసం చేపట్టిన ర్యాలీని పాటీదార్లే అడ్డగించడంతో బీజేపీ కంగు తింది. దీంతో నష్టనివారణ చర్యల కోసమే ఆనందీ బెన్ ను ఢిల్లీకి పిలిపించారనే మాటలు కూడా వినిపిస్తున్నాయి. మోదీ గుజరాత్ ను పాలించిన 12 ఏళ్ల కాలంలో ఆనందీ బెన్ పటేల్, అమిత్ షా ఆయనకు సన్నిహితులు. 2014 ఎన్నికల తర్వాత గుజరాత్ బాధ్యతలను ఆనందీ బెన్ కు, అమిత్ షాకు పార్టీ అధ్యక్ష పదవిని అప్పగించడానికి కూడా ఇదే ప్రధాన కారణం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : prime minister narendra modi  anandiben patel  surat rally  summons  

Other Articles