be in control or else i willl cut it.. MP warns actor

Dont lose your toungue or else i willl cut it mp warning

tdp mp shiva prasad, chittor mp shiva prasad, actor turned politician shiva prasad, hero shivaji, actor shivaji, ap special status, pawan kalyan

dont loose your toungue chitoor MP actor turned politician shiva prasad warns another actor shivaji who is fighiting for andhra pradesh special status

నాలుక అదుపులో పెట్టుకో లేదంటే కోసేస్తా.. టీడీపీ ఎంపీ హెచ్చరిక

Posted: 09/03/2016 09:18 AM IST
Dont lose your toungue or else i willl cut it mp warning

గత పార్లమెంటు ఎన్నికలకు ముందు రకరకాల వేషాలు వేసి.. రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసిన ఎంపీ కనీసం ఒక్కసారైనా అదే తరహాలో ఏపీకి ప్రత్యేక హోదాపై పార్లమెంటులో నిలదీయడం లేదమిటీ అంటూ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న సినీ నటుడు శివాజీపై టీడీపీ సీనియర్ నేత, చిత్తూరు ఎంపీ శివప్రసాద్ ఆగ్రహావేశాలతో ఊగిపోయారు. ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ ఎంపీల చిత్తశుతద్దిని శంఖించాల్సి వస్తుందని ఆయన దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడుస్తున్న.. టీడీపీ మౌనం వీడకపోవడం ఏపీకి శాపంగా మారుతుందని మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదా రానిపక్షంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇంటి ముందే ఆత్మహత్య చేసుకుంటానని సినీనటుడు శివాజీ హెచ్చరించిన విషయం తెలిసిందే. కాగా, హోదా విషయంలో కేంద్ర మంత్రి సుజనా చౌదరి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని కూడా ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై చిత్తూరులో మీడియాతో మాట్లాడిన సందర్భంగా శివాజీ వ్యాఖ్యలను ప్రస్తావించిన శివప్రసాద్... మరోమారు చంద్రబాబు, సుజనా చౌదరిల మాటెత్తితే నాలుక తెగ్గోస్తానని హెచ్చరించారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధన కోసం ఇటు రాష్ట్రం, అటు కేంద్రం మధ్య వారధిగా వ్యవహరిస్తున్న కేంద్రమంత్రి సుజనా చౌదరి... కీలకంగా వ్యవహరిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. అలాంటి నేతను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తొత్తు అంటూ నిందారోపణలు చేయడం శివాజీకి తగదని హితవు పలికారు. నోరు అదుపులో పెట్టుకోవాలని లేదంటే నాలుకను తెగ్గోస్తానని హెచ్చరించారు. ఇకనైనా మాట తీరు, పధ్ధతి మార్చుకోవాలని... లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని శివప్రసాద్ హెచ్చరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tdp mp shiva prasad  hero shivaji  actor shivaji  ap special status  

Other Articles