విజయవాడ వీధి కుక్కలకు గ్రాండ్ ఫేర్ వెల్ | Grand farewell for Vijayawada street dogs

Grand farewell for vijayawada street dogs

grand farewell for Vijayawada street dogs, Vijayawada Street Dogs, grand farewell for dogs, Vijayawada dogs, Vijayawada municipal

grand farewell for Vijayawada street dogs, which catches at Pushkaras.

బెజవాడలో వీధికుక్కలకు గ్రాండ్ ఫేర్ వెల్

Posted: 08/26/2016 08:52 AM IST
Grand farewell for vijayawada street dogs

నవ్యాంధ్ర వాణిజ్య రాజధాని విజయవాడలో వీధి కుక్కలకు ఘనంగా ఫెర్ వేల్ పలికారు అక్కడి అధికారులు. విడిచిపెట్టే ముందు వాటికి గ్రాండ్ గా భోజనం పెట్టి సెండాఫ్ ఇచ్చారు. పెరుగన్నం, సాంబారన్నం, పాలు, అన్నం తదితర వాటిని ఆహారంగా పెట్టారు. పుష్కరాల సందర్భంగా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు వివిధ ఘాట్లలో సంచరిస్తున్న వీటిని బంధించిన మునిసిపల్ అధికారులు, గురువారం వాటికి విముక్తి కలిగించారు.

మొత్తంగా 1,084 కుక్కలను పట్టుకున్న అధికారులు పుష్కరాలు జరిగే అన్ని రోజులు వాటిని జాగ్రత్తగా చూసుకున్నారు. గోదావరి పుష్కరాల సంద్భరంగా 78 కుక్కకాట్ల కేసులు నమోదవడంతో అప్రమత్తమైన విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్(వీఎంసీ) అధికారులు కృష్ణా పుష్కరాల్లో అటువంటి ఫిర్యాదులు రాకూడదని భావించారు. వివిధ ఘాట్లలో సంచరిస్తున్న కుక్కలను బంధించి అజిత్‌సింగ్ నగర్‌లో ఏర్పాటు చేసిన పెద్ద బోనులో వాటిని ఉంచారు.శునకాలకు ఆహారం కోసం ప్రత్యేకంగా కొంత బడ్జెట్‌ను కేటాయించారు.

బంధించిన వాటిలో 528 శునకాలకు సంతానోత్పత్తి లేకుండా స్టెరిలైజ్ చేశారు. 556 కుక్కలకు యాంటీ రేబిస్ టీకాలు ఇచ్చారు. వ్యాక్సినేషన్ పూర్తియిన తర్వాత వాటిని తిరిగి వదిలేశారు. అజిత్‌సింగ్ నగర్‌లో ఏర్పాటు చేసిన ఎక్సెల్ ప్లాంట్ ద్వారా పదివేల శునకాలకు స్టెరిలైజ్ చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏపీలోని అన్ని మునిసిపాలిటీల్లో శునకాలకు స్టెరిలైజ్ చేసేందుకు ప్రత్యేకంగా ‘యూఎల్‌బీ డాగ్ స్టెరిలైజేషన్ ఇన్ ఏపీ’’ అనే యాప్‌ను విడుదల చేసినట్టు యానిమల్ కేర్ ల్యాండ్ వ్యవస్థాపకుడు డాక్టర్ ఎన్వీ శ్రీకాంత్ బాబు తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijayawada  street dogs  grand farewell  

Other Articles