హర్దిక్ పటేల్ పై అనుచరుల సంచలన ఆరోపణలు | Hardik Patel misusing community's money and become wealthy

Hardik patel misusing community s money and become wealthy

Sensational Comments on Hardik Patel, Hardik Patel aides, chirag Patel ketan patel, Hardik Patel misusing community's money, Allegations on Hardik Patel, Hardik Patel Expell, Hardik Patel Udaypur

Hardik Patel aides turn against him, accuses Hardik misusing community's money and becomes wealthy.

పటేల్ సాబ్ కి పక్కలో బల్లాలు ఎక్కువయ్యాయి

Posted: 08/23/2016 12:29 PM IST
Hardik patel misusing community s money and become wealthy

వరుసగా తగులుతున్న దెబ్బలు పటేల్ ఉద్యమ నేత హర్దిక్ ను కోలుకోకుండా చేస్తున్నాయి. దేశ ద్రోహం ఆరోపణలపై అరెస్టయి జైలు జీవితం గడిపి, ఆపై ఆర్నెల్ల బహిష్కరణతో బయటికి వచ్చాడు. ప్రస్తుతం ఉదయ్ పూర్ లో ఉంటున్న హర్దిక్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నాడు. ఇంతలో అనుకోని షాక్ అతనికి తగిలింది.

ఉద్యమ సమయంలో హర్దిక్ పటేల్ అనుచరులుగా వ్యవహరించిన వారే ఇప్పుడు అతనికి వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నారు. అతని వెన్నంటె ఉన్న చిరాగ్, కేతన్ లు ఇప్పుడు సంచలన ఆరోపణలు చేశారు. తన స్వార్థం కోసమే హర్దిక్ పటేల్ ఉద్యమం లేపాడని వారు ఆరోపించారు. తాను ఒక్క ఏడాది కాలంలోనే నాయకుడిగా ఎదగాలని, దాంతోపాటు కోటీశ్వరుడిని కావాలనే ఉద్దేశంతోనే ఆ ఉద్యమం మొదలుపెట్టాడని అంటున్నారు. దీనిపై హార్దిక్‌ ను ఉద్దేశించి ఏకంగా ఓ బహిరంగ లేఖ రాయటం విశేషం.

 ''మీరు నాయకుడిగా ఎదగాలని, భారీ మొత్తంలో డబ్బు కూడగట్టుకోవాలని స్వార్థంతో వ్యవహరించారు. దానివల్ల పటేల్ వర్గంతో పాటు మన సంస్థకు కూడా భారీ నష్టం జరిగింది'' అని ఆ లేఖలో పేర్కొన్నారు. ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయినవాళ్ల కుటుంబాలను ఆదుకోవాల్సింది పోయి హార్దిక్, ఆయన స్నేహితులు విలాసవంతమైన జీవితం గడిపారని, అమరులకు సాయం చేయడానికి సేకరించిన విరాళాలతో హార్దిక్, ఆయన మామ విపుల్‌భాయ్ ఖరీదైన కార్లు కొన్నారని ఆరోపించారు. సాధారణంగా జైలుకు వెళ్లారంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లడమే కష్టమని, కానీ హార్దిక్ మాత్రం జైలుకు వెళ్లిన తర్వాత కోటీశ్వరుడు అయ్యాడని చిరాగ్, కేతన్ అంటున్నారు.

గతంలో హార్దిక్ పటేల్‌కు కుడి, ఎడమ భుజాలుగా ఉన్న చిరాగ్ పటేల్, కేతన్ పటేల్ ఈ విషయాలు వెల్లడించడంతో హర్దిక్ అసలు స్వరూపం ఇదేనంటూ బీజేపీ దుమ్మెత్తి పోస్తుంది. గతంలో హర్దిక్ నియంతలా వ్యవహరిస్తున్నాడని ఫక్రుద్దీన్ అనే మరో నేత ఆరోపించిన సంగతి తెలిసిందే. వ్యవహారం మానకపోతే అతడి చీకటి నిజాలను బయటపెడతామని అప్పట్లో ఆయన హెచ్చరించారు కూడా.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Patidar Moment  Hardik Patel  Aides  Alleges  become rich  

Other Articles