44 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసిన గుజరాత్ స్పీకర్ | Gujarat Speaker suspended 44 Congress legislators

Gujarat speaker suspended 44 congress legislators

Gujarat Speaker suspended, After Telugu States, Tamilnadu same scene repeat in Gujarat, Gujarat Speaker Ramanlal Vora, Gujarat Congress suspended MLAs, Gujarat Congress MLAs suspended

Gujarat Speaker suspended 44 Congress legislators over Una flogging incident agitation.

గుజరాత్ అసెంబ్లీలోనూ సేమ్ సీన్ రిపీట్

Posted: 08/23/2016 01:07 PM IST
Gujarat speaker suspended 44 congress legislators

ఈ అసెంబ్లీలకు ఏమైంది, ఓవైపు ప్రతిపక్షాల నినాదాలు... మరోవైపు స్పీకర్ ల సస్పెండ్ ఆర్డర్లు. స్పీకర్ అధికార పక్షానికి చెంది ఉండాలన్న నియమావళిని మార్చాలన్న డిమాండ్ వినవస్తున్న వేళ, సభలో పార్టీలు ముఖ్యంగా అధికార పార్టీలు కనీస విలువలను పాటిస్తున్నాయా? అన్నఅనుమానాలు విశ్లేషకులు లెవనెత్తున్నారు. వరుసగా పలు రాష్ట్రాల చట్టసభల్లో విపక్ష సభ్యుల సస్పెన్షన్ల పర్వమే ఇందుకు తార్కాణం అని వారంటున్నారు. సభాకార్యకలాపాలకు అవాంతరాలు సృష్టిస్తున్నారంటూ వారిని మరో మాటే లేకుండా స్పీకర్లు సస్పెండ్ చేసేస్తున్నారు.

మొన్నటి దాకా తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన ఎమ్మెల్యేల సస్పెన్షన్ తాజాగా తమిళనాడుకు కూడా పాకిన సంగతి తెలిసిందే.  అమ్మ పై కాస్త ఘాటు విమర్శలే చేసినందుకు డీఎంకే ఎమ్మెల్యేలను వారంపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ధనపాల్ ప్రకటించడం, దానిని నిరసిస్తూ సభ బయటే ఎమ్మెల్యేలు ఆందోళన చేపట్టడం తెలిసిందే. ఇక ఇప్పుడు ఆ వ్యాపకం గుజరాత్ కు పాకింది. తాజాగా గుజరాత్ అసెంబ్లీలో సస్పెన్షన్ల పర్వం కొనసాగుతోంది.

ఉనా దళితుల ఘటనను గుజరాత్ అసెంబ్లీలో ఆ రాష్ట్రంలోని విపక్షం కాంగ్రెస్ ప్రస్తావించింది. మంగళవారం ఉదయం సభ ప్రారంభమైన కాసేపటికే ఈ అంశంపై గళం విప్పిన ఆ పార్టీ ఎమ్మెల్యేలు బాధితులకు న్యాయం చేయడంతో పాటు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్ కు ప్రభుత్వం స్పందించాలని వారు సభలోనే ఆందోళనకు దిగారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన స్పీకర్ మొత్తం 44 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేశారు. ఆందోళనలు సహేతుకమైనవే అయినా సభలో ప్రతిపక్షం లేకుండా చర్చలు జరగటం చట్టసభలకు మంచిది కాదని, అదే సమయంలో ప్రతిపక్షాలు సమన్వయంతో వ్యవహరించాలని, సస్పెండ్ కాకుండా స్పీకర్లు ప్రత్యామ్నాయం ఆలోచించాలని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gujarat  Assembly  speaker  suspended  44 MLAs  

Other Articles