Terrorist captured alive by security forces in Kashmir is a Pakistani from Lahore

Pakistani terrorist arrested in kashmir is 22 a resident of lahore

Bahadur ali, Bahadur Ali resident of lahore, Pakistani terrorist bahadur ali, pak terrorist Bahadur Ali caught alive, Kashmir encounter, Lashkar-e-Toiba, Nowgam sector, Kupwara district, Kashmir unrest, Indian Army, Jammu and Kashmir

A terrorist, who was captured alive by security forces after a fierce gunbattle in Kashmir on Tuesday, is a Pakistani national, said Home Ministry sources

ఆ ఉగ్రవాది పాక్ జాతీయుడే..

Posted: 07/27/2016 04:37 PM IST
Pakistani terrorist arrested in kashmir is 22 a resident of lahore

దాయాధి దేశం పాకిస్థాన్ మన దేశంలోని కాశ్మీర్ లో విధ్వంసాలకు పాల్పడుతుందని, ఒక వైపు కాశ్మీర్ ప్రజలను ఉసిగోల్పడంతో పాటు కశ్మీర్‌లోకి ఉగ్రవాదుల అక్రమ చోరబాట్లకు మద్దనిస్తుందన్న కేంద్ర మంత్రులు రాజ్ నాథ్ సింగ్, సుష్మాస్వరాజ్ ల వ్యాఖ్యలు ముమ్మాటికీ నిజమని తేలాయి. పాకిస్తాన్ లో కాశ్మీర్ ఎప్పుడు కలుస్తుందా అని సాక్షాత్తు అ దేశ ప్రధాని నవాజ్ షరీఫ్ వ్యాఖ్యానించడంతో చోరబాట్లకు, కాశ్మీర్ లోని విధ్వంసాలకు పాకిస్తాన్ కారణమని స్పష్టమవుతుంది. ప్రభుత్వంతో పాటు పాకిస్థాన్ అర్మీ కలిసే అక్రమ చోరబాట్లకు తేరలేపుతున్నాయన్నది వెల్లడైంది.

ఇదిలా వుండగానే తాజాగా కుప్వారా జిల్లా నౌగామ్ జిల్లాలో ఉగ్రవాదులకు, భద్రతాదళాలకు మధ్య జరిగిన హోరాహోరీ ఎన్‌కౌంటర్‌లో సజీవంగా పట్టుబడిన ఉగ్రవాది కూడా పాకిస్తాన్ కు చెందిన వాడు కావడం పాకిస్తాన్ కుట్రలను మరోమారు బాహ్య ప్రపంచానికి తెలియజేసింది. భారత దేశమే  తమ దేశంలోని విధ్యంసాలకు కారణమని పాకిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి చేసిన వ్యాఖ్యలు కేవలం కపట పూరితమైనవని తేలింది. భారత్ ను ఇరుకున పెట్టి ప్రపంచ దేశాలలో తాము సచ్ఛీలులమని రుజువు చేసుకునే ప్రయత్నమేనని బయటపడింది.

కుప్వారా జిల్లా నౌగామ్ సెక్టార్ట్ లో భారత భద్రతా దళాలకు సజీవంగా పట్టుబడిన లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాది పాక్ జాతీయుడుగా గుర్తించారు. ఈ కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతం కాగా, పట్టుబడిన ఉగ్రవాదిని పాకిస్థాన్‌లోని లాహోర్‌ సిటీకి చెందిన బహదూర్ అలీగా గుర్తించినట్టు హోం మంత్రిత్వ శాఖ వర్గాలు బుధవారంనాడు వెల్లడించాయి. ఈ విషయాన్ని హోం శాఖ సహాయ మంత్రి హన్సరాజ్ అహిర్ ధ్రువీకరించారు. 22 ఏళ్ల వయసున్న బహదూర్ అలి అలియాస్ సైఫుల్లా గెరిల్లా యుద్ధతంత్రంలో లష్కరే తోయిబా వద్ద శిక్షణ పొందాడు.

అతని వద్ద నుంచి మూడు ఏకే-47 రైఫిళ్లు, రెండు పిస్తోళ్లు, రూ.23,000 భారత కరెన్సీని భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. గత రెండు నెలల్లో పాకిస్థాన్ ఉగ్రవాదులను కుప్వారా జిల్లాలో సజీవంగా ప్టటుకోవడం ఇది రెండోసారి. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తీథ్వాల్ ప్రాంత నుంచి కాశ్మీర్‍ లోయలోకి ఒకరోజు క్రితమే ఉగ్రవాదులు ప్రవేశించినట్టు హోం మంత్రిత్వ శాఖ తెలిపింది. తాంగ్డ్‌హార్ సెక్టార్‌లోకి ప్రవేశించిన ఉగ్రవాదులు అక్కడి నుంచి లీపా వ్యాలీలోకి అడుగుపెట్టి, ఆ తర్వాత అటవీ ప్రాంతంలోకి చొరబడ్డారని, అక్కడే ఎన్‌కౌంటర్ జరిగిందని ఆ వర్గాలు తెలిపాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bahadur Ali  lahore  pakistan terrorist  kashmir encounter  lashkar e toiba  indian army  

Other Articles