Samsung Smartphone Users to Get Reliance Jio SIM With 3 Months Free Data

Reliance jio ties up with samsung to offer 4g services

Reliance industries, Reliance jio, Reliance, tata consultancy services, west bengal, mamata banerjee, convoy, car, darjeeling, president, pranab mukharjee, Hardik Patel, Pokemon, uber sweet ice-cream, France, reliance digital, samsung, samsung galaxy a5, samsung galaxy a5 2016, samsung galaxy a7, samsung galaxy a7 2016, samsung galaxy a8, samsung galaxy note 4, samsung galaxy note 5, samsung galaxy note 5 duos, samsung galaxy note edge, samsung galaxy s6, samsung galaxy s6 edge, samsung galaxy s6 edge plus, samsung galaxy s7, samsung galaxy s7 edge

Samsung and Reliance Jio have partnered to allow users of select smartphones to avail of the Jio Preview Offer. While the offer was previously only available bundled with the purchase of Reliance Retail's Lyf brand of smartphones

బాఫ్ రే భాప్.. రిలయన్స్ జియో బ్రహ్మాండమైన ఆపర్

Posted: 07/15/2016 02:45 PM IST
Reliance jio ties up with samsung to offer 4g services

స్వతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని పలు నగరాలలో తమ వాణిజ్య సేవలను కస్టమర్లకు అందుబాటులోకి తీసుకురానున్న రిలయెన్స్ జియో.. అప్పుడే సంచలనాలకు తెరతీస్తుంది. గత కొన్నాళ్లుగా మార్కెట్ లో 4జీ సేవలతో స్థిరపడిపోయిన పోటీదారులకు తొలిషాక్ ఇస్తూ.. బ్రహ్మాండమైన బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. అదేంటంటే ఇప్పటి వరకు తమ సంస్థ విక్రయిస్తున్న కేవలం లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే తమ 4జీ సేవలను అందించేందుకు ముందుకు వచ్చిన రిలయన్స్ ఇకపై శాంసంగ్ స్మార్ట్ ఫోన్ కస్టమర్లు కూడా ఈ ఆఫర్లను అందించనుంది. కేవలం రూ.200లతో సిమ్ కొనుకున్న వారికి 75జీబీ 4జీ డేటా.. 4500 నిమిషాల ఉచిత కాలింగ్ సౌకర్యం వంటి ఆపర్లతో కస్టమర్లను తనవైపు మళ్లించుకునే ప్రయత్నం చేస్తుంది.

ఈ మేరకు రిలయెన్స్ జియో,  శాంసంగ్ కంపెనీతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంతో జియో ప్రీవ్యూ ఆఫర్ తో స్మార్ట్ ఫోన్ ను ఎంపికచేసుకునేలా శాంసంగ్ ఓనర్లకు రిలయెన్స్ అందుబాటులో ఉండనుంది. లైఫ్ బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లకే ఇప్పటివరకూ ఈ సిమ్ ఆఫర్ ప్రకటించిన రిలయెన్స్, మొదటిసారి ఒక స్మార్ట్ ఫోన్ తయారీదారితో తన భాగస్వామ్యం ఏర్పరుచుకుంది. ఉచిత వాయిస్ సదుపాయంతో పాటు మూడు నెలల ఉచిత అన్ లిమిటెడ్ డేటా, ఎస్ఎమ్ఎస్ ఆఫర్లతో శాంసంగ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు ఈ రిలయెన్స్ జియో సిమ్ ను పొందవచ్చు. అంతేకాక మూవీస్, బుక్స్, మ్యూజిక్ ను జియో యాప్స్ సౌకర్యాన్ని కూడా అందుబాటులో ఉంచింది. అయితే ఈ ఆఫర్ కేవలం కొత్త శాంసంగ్ కస్టమర్లకూ.. ఈ ఆఫర్ తో కొనుగోలు చేసిన స్మార్ట్ ఫోన్ కస్టమర్లకు మాత్రమేనని రిపోర్టులు తెలిపాయి.

రిపోర్టుల ప్రకారం...శాంసంగ్ గెలాక్సీ ఏ5,ఏ7, ఏ8, నోట్ 4, నోట్ 5, నోట్ ఎడ్జ్, ఎస్6, ఎస్6 ఎడ్జ్, ఎస్6 ఎడ్జ్ ప్లస్, ఎస్7, ఎస్7 ఎడ్జ్ లకు ఈ ఆఫర్ వర్తించనుంది. ఈ శాంసంగ్ స్మార్ట్ ఫోన్ల యూజర్లు జియో ఆఫర్లను పొందాలనుకుంటే, మైజియో యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం జియో కనెక్షన్ కోసం "గెట్ జియో సిమ్" ఆప్షన్ ను ఎంచుకోవాలి. ఈ ఆప్షన్ తో బార్ కోడ్ కలిగిన కూపన్ ను కస్టమర్లు పొందుతారు. చివరికి రిలయెన్స్ డిజిటల్ స్టోర్ లో ఫోన్ తో పాటు వెళ్లి, పాస్ పోర్ట్ సైజు ఫోటోలను, అవసరమైన డాక్యుమెంట్లను సమర్పించి ఈ సిమ్ ను తీసుకోవచ్చు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : reliance jio  samsung  bumper offer  reliance digital  Jio commercial  4g mobiles  

Other Articles