మోదీ ఫేక్ ట్వీట్ తో ఫూల్స్ ను చేశాడు | Pankaj Advani gets trolled for his Modi's tweet

Pankaj advani gets trolled for his modi s tweet

World Billiards Champion Pankaj Advani Modi, Advani fake tweet about Modi, Fake tweet about Modi viral, Advani miss tweet about Modi, Advani make fools with Modi fake tweet, Modi twitter, తాజా వార్తలు, మోదీ ఫేక్ ట్వీట్, అద్వానీ ఫేక్ ట్వీట్, అద్వానీ మోదీపై ఫేక్ ట్వీట్, మోదీ ఫేక్ ట్వీట్, మోదీ ఉత్తమ ప్రధాని ఫేక్ ట్వీట్

World Billiards Champion Pankaj Advani gets trolled for his Modi's UNESCO tweet.

మోదీ ఫేక్ ట్వీట్ తో బకరాలను చేశాడు

Posted: 06/28/2016 11:01 AM IST
Pankaj advani gets trolled for his modi s tweet

దేశ ప్రధాని నరేంద్ర మోదీకి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రేజ్ ఏంటో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. పాలనపరంగానే కాదు, పాపులారిటీలోనూ ఆయా విదేశాల్లోనూ తోపే. సోషల్ మీడియాను ఈయన వాడుకున్నంత మరేయితర ప్రధాని వాడుకోడంటే అతిశయోక్తి కాదు. అంతేకాదు ప్రపంచాధినేతలు కూడా ట్విట్టర్లో, ఫేస్ బుక్ లో ఆయనను ఫాలో అయ్యేవారే. ఆయనకు సంబంధించిన వారకు ఏ న్యూస్ అయినా సెన్సేషనే. అలాంటిది మోదీ గురించి అద్వానీ చేసిన ఓ ట్వీట్ తో లక్షల మంది పూల్స్ అయ్యారు.

అద్వానీ అంటే బీజేపీ సీనియర్ నేత కాదు. ప్రముఖ బిలియర్డ్స్ ఛాంపియన్ పంకజ్ అద్వానీ. ప్రముఖ సంస్థ యూనెస్కో ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రధానిగా మోదీని ఎంపిక చేసిందంటూ ఓ పుకారు రేగింది. అయితే అది తప్పుడు వార్త అని తెలియని అద్వానీ దాన్ని మరింత వైరల్ చేసి తనతోపాటు లక్షల మందిని బకరాలను చేశాడు. అసలు పోస్ట్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు గానీ, కంగ్రాట్స్ అంటూ తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశాడు. ఇక ఆయన సెలబ్రిటీ కావటం, పైగా ఆయన ఖాతాలో రెండు లక్షల మంది ఫాలోవర్లు ఉండటంతో ఆ ట్వీట్ క్షణాల్లో పాకిపోయింది.

అంతేకాదు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్, వాట్స్ యాప్ ఇలా అన్నింట్లోకి పాకిపోయింది. మోదీ కంగ్రాట్స్ అంటూ ప్రపంచ వ్యాప్తంగా అభినందనలు వెలువెత్తాయి. అయితే అదంతా బుస్... అంటూ అసలు విషయాన్ని నిదానంగా చెప్పింది యూనెస్కో. ఎక్కడో వాట్సాప్ లో పుట్టిన ఈ ఫేక్ అంతా తిరిగి అద్వానీ ఖాతాకి చేరితే.  ఆయన దాన్ని వైరల్ చేశారన్నమాట. ఇక విషయం తెలిసిన ప్రముఖ రచయిత చేతన్ భగత్ అద్వానీని చెడుగుడు అడుకున్నాడు. దీంతో తన తప్పును క్షమించమంటూ పంకజ్ అద్వానీ మరో పోస్ట్ పెట్టడంతో నెటిజన్లు శాంతించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles