Rahul takes dig at Modi over India's failed bid for NSG membership

Rahul takes a dig at pm over nsg membership bid

US, India, Non-NPT, NSG, Delhi, NSG, India, China, nuclear supply group, PM Modi, Narendra Modi, Modi govt failure, Rahul Gandi, Congress, Mexico, argentina Ambassador Rafael Grossi

Congress vice-president Rahul Gandhi on Saturday criticised Prime Minister Narendra Modi for his failure in getting India membership to the Nuclear Suppliers Group

కేంద్రంపై మండిపడ్డ రాహుల్.. ఫలించని మోడీ దౌత్యమని విమర్శ

Posted: 06/26/2016 08:12 AM IST
Rahul takes a dig at pm over nsg membership bid

అణు సరఫరాదారుల గ్రూప్ (ఎన్ఎస్జీ)లో భారత స్వభ్యత్వం కోసం నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన దౌత్యం విఫలమవ్వడంతో కాంగ్రెస్ పార్టీ కేంద్ర సర్కార్ పై విరుచుకుపడింది. సియోల్‌లో జరిగిన ఎన్ఎస్జీ సదస్సులో అంతర్జాతీయంగా భారత్‌ కు ఇది భంగపాటుగా కాంగ్రెస్ పార్టీ అభివర్ణించగా.. ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరో అడుగు ముందుకేసి.. నేరుగా ప్రధానమంత్రి నరేంద్రమోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు.

ఎన్ఎస్జీలో భారత్‌కు స్వభ్యత్వ నిరాకరణ మోదీ దౌత్య వైఫల్యానికి నిదర్శమని రాహుల్ ట్విట్టర్ లో విమర్శించారు. ఎన్ఎస్జీ విషయంలో నరేంద్రమోదీ జరిపిన సంపద్రింపులు విఫలమయ్యాయని, ఇది దౌత్యపరంగా మోదీ ఫెయిలవ్వడమేనని హ్యాష్‌ట్యాగ్ జోడించారు. ప్రతిష్టాత్మక ఎన్ఎస్జీలో స్వభ్యత్వం కోసం భారత్ కొన్ని నెలలుగా సంప్రదింపులు జరిపినప్పటికీ, చివరిక్షణంలో చైనా మోకాలడ్డటంతో ఈ ప్రయత్నం విఫలమైంది. అయితే అణు సరఫరాదారుల గ్రూప్ సభ్యత్వంలో చేరేందుకు భారత్ ఆశలు సజీవంగానే వున్నాయి.

ఈ ఏడాది చివర్లో మరోమారు జరగనున్న ఎన్ఎస్జీ సదస్సులో భారత్ రమారామి అవకాశాలను మెరుగుపర్చుకోనుందని అగ్రరాజ్యం అమెరికా కూడా అశాభావం వ్యక్తం చేసింది. ఈ ఏడాది చివర్లో మరోమారు సమావేశం కావాలని మెక్సికో దేశం ప్రతిపాదించిగా, దానిని కూడా చైనా వ్యతిరేకించిదని సమాచారం. అయితే చైనా వ్యతిరేకతను తోసిపుచ్చిన ఎన్ఎస్జీ సభ్య దేశాల సదస్సు ఈ ఏడాది చివర్లో మారోమారు సమావేశానికి సుముఖతను వ్యక్తం చేసింది. దీంతో ఈ సమావేశంలో భారత్ సభ్యదేశంగా అవతరించే అవకాశాలున్నాయి.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NSG  India  China  nuclear supply group  PM Modi  Narendra Modi  Modi govt failure  Rahul Gandi  Congress  

Other Articles