congress rajya sabha mp chiranjeevi slams TDP Government on mudragada stir

Chiranjeevi says government should be ready to face the consequences

mudragada hunger strike, kapu reservations, kapu leaders meet, chiranjeevi, dasari narayana rao, hunger strike, rajamundry hospital, chandrababu naidu, kapu leaders, hunger strike, pesticide, tuni violence, mudragada padmanabham, amalapuram one town police station, Mudragada fast unto death, mudragada hunger strike, NTR,

Congress Rajya sabha MP chiranjeevi warns chandrababu Government that it should be ready to take responsibility if any thing happens to Kapu caste leader Mudragada padmanbham.

ముద్రగడకు హాని జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవు : చిరంజీవి

Posted: 06/14/2016 07:07 AM IST
Chiranjeevi says government should be ready to face the consequences

కాపు రిజర్వేషన్ల అంశంపై నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న ముద్రగడ పద్మనాభానికి ఏమైనా అయితే తీవ్ర పరిణామాలు తప్పవని కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు, సినీనటుడు చిరంజీవి హెచ్చరించారు. ఈ విషయంలో ప్రభుత్వం జాప్యం చేసినా, నిర్లక్ష్యం వహించినా తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. కాపు రిజర్వేషన్ల అంశం, ముద్రగడ పద్మనాభం దీక్ష నేపథ్యంలో వివిధ పార్టీలకు చెందిన కాపు ప్రముఖుల సమావేశం అనంతరం ముగిసిన తర్వాత చిరంజీవి మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాపు కులస్థులకు ఇచ్చిన హామీలపై ప్రభుత్వానికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, లేదంటే రెండు రోజుల తర్వాత సమావేశమై భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని చెప్పారు. ముద్రగడ కుటుంబసభ్యులపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

గత పది రోజులుగా ఏపీలో చాలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడిందని, ఇది చాలా అప్రజాస్వామికమని చిరంజీవి అన్నారు. ముద్రగడ పద్మనాభం దీక్ష ప్రారంభించిన రెండు గంటల్లోపే తలుపులు పగలగొట్టి, ఆయనను నిర్బంధించి అయోమయ పరిస్థితి కల్పించారని, ఆయన కోడలు, భార్య పట్ల అమానుషంగా ప్రవర్తించారని మండిపడ్డారు. దీన్ని తామంతా కలిసికట్టుగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ పరిస్థితి రావడం దురదృష్టకరమని అన్నారు. ఆయన అడగకూడనిది ఏమీ అడగలేదని, టీడీపీ మేనిఫెస్టోలో పెట్టినవి, ఎన్నికల కమిషన్‌కు సమర్పించినవే అడిగారని గుర్తు చేశారు. తుని ఘటనను తామెవరూ సమర్థించబోమని, అయితే ప్రభుత్వ ప్రతినిధులే ఆ ఘటనలో గోదావరి జిల్లాలకు చెందినవాళ్లు ఎవరూ లేరని.. పులివెందుల వాళ్లే ఉన్నారని అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు. అలాంటి మీరు ఈ రోజున అక్కడి యువకులను నిర్బంధించి, వాళ్లకు సంఘీభావం తెలిపిన వాళ్లను జైల్లో పెట్టడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. ముద్రగడ ఆరోగ్యం ఎలా ఉందోనన్న ఆందోళన తామందరికీ ఉందని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles