రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడు | Luckiest kid escapes from an accident

Luckiest kid escapes from an accident

Luckiest kid, East china, LUCKY TODDLER, చిన్నారి, ప్రమాదం, అంతర్జాతీయ వార్తలు, తాజా వార్తలు, china news, latest news, entertainment

In a shocking video, a Chinese infant escaped unhurt after a minivan hit and almost run him over, at a business area in East China. The incident was recorded by a CCTV camera installed at the shopping mall where the parents of the child had come to shop.

ITEMVIDEOS: రెండేళ్ల బాలుడు మృత్యుంజయుడు

Posted: 05/28/2016 05:44 PM IST
Luckiest kid escapes from an accident

సుడి ఉంటే పెను ప్రమాదం నుంచైనా ప్రాణాలతో గట్టెక్కేయొచ్చు. అదే గాచారం బాగోలేదనుకోండి గుండు పిన్ను తగిలి కూడా గుట్టుకున చావొచ్చు. అయితే ఇక్కడ మాత్రం ఓ రెండేళ్ల బుడతడు అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాడు. చావు దాదాపు అంచుల దాకా వెళ్లినట్లే వెళ్లి ఆగిపోయి వెనక్కి వచ్చాడు. చైనాలోని ఓ మార్కెట్ పరిధిలోని సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలను చూస్తే ఎవరికైనా ఒళ్లుగగుర్పొడం ఖాయం.  

https://www.youtube.com/watch?v=G72hOJzeaEI

ఆ పసిబాలుడు తల్లిదండ్రులతో సూపర్ మార్కెట్కు వచ్చాడు.  పేరెంట్స్ పక్కనే ఉన్న మార్కెట్లో షాపింగ్ బిజీలో ఉన్నారు. బాలుడు ఆడుకుంటుండగా రొడ్డుమీదకు వచ్చేశాడు. ఇంతలో ఓ మినీ వ్యాన్ పార్కింగ్ నుంచి బయటికి వచ్చి బాలుడ్ని ఢీకొట్టింది. డ్రైవర్ ఆ పసివాడిని గమనించకుండా ముందుకు పోనిచ్చాడు. ముందు రెండు టైర్ల మధ్యలో, కుడివైపు టైరుకు దాదాపు ఆనుకొని బాలుని పక్క నుంచి వ్యాను వెళ్లింది. గమనించిన డ్రైవర్ వెంటనే బ్రేక్ వేశాడు. అదృష్టం కొద్ది అక్కడ నీరు ఉండటంతో బ్రేక్ వేయడంతో ఆగిన టైర్లు బాలున్ని ముందుకు తోశాయి. లేక పోతే టైర్లు బాలుని పైకి ఎక్కేవి.  ప్రమాదాన్ని గమనించిన బాలుని తల్లిదండ్రులు వెంటనే అక్కడకు వచ్చి బాలున్ని బయటకు తీశారు. వ్యాన్ కింద పడి వెనక టైర్లు ముందుకు లాక్కు రావటంతో బాలుడు స్పల్పగాయాలతో బయటపడ్డాడు.  ఈ సంఘటన తూర్పు చైనాలో జియాంగ్సు ప్రావిన్స్లోని క్సుజోహులో చోటు చేసుకుంది.

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : shocking video  chienese toddler  eastchina  

Other Articles