ప్రభుత్వ కార్యాలయంలో దుశాసన పర్వం | Rape attempt Caught on CCTV in Bangalore government office

Rape attempt caught on cctv in bangalore government office

Rape attempt, Bangalore government office, CCTV footage, sarpanch arrested, బెంగళూర్ ప్రభుత్వ కార్యాలయం, సర్పంచ్, అత్యాచారయత్నం, లేటెస్ట్ న్యూస్, జాతీయ వార్తలు, national news, latest news

Rape attempt Caught on CCTV in Bangalore government office. sarpanch arrested.

ITEMVIDEOS: ప్రభుత్వ కార్యాలయంలో దుశాసన పర్వం

Posted: 05/28/2016 05:17 PM IST
Rape attempt caught on cctv in bangalore government office

కామం కళ్లను కప్పేసింది, దానికి అదనంగా అధికార మదం జత కలిసింది. వెరసి ఎక్కడైనా, ఏమైనా చెయ్యొచ్చనే ఆలోచన ఆ దుర్మార్గుడి మెదడులో  మెదిలింది. వరుసగా దారుణాలు చోటుచేసుకుంటున్న కర్ణాటకలోనే మరో ఘోరమైన ఘటన జరిగింది. ఇప్పటికే ఆ రాష్ట్ర రాజధాని సహా పలు ప్రాంతాల్లో మహిళలపై మృగాళ్లు దారుణాలకు ఒడిగడుతున్నారు. ఇక ఇప్పుడే ఏకంగా ప్రభుత్వ కార్యాలయంలోనే మహిళపై లైంగికదాడికి యత్నం జరిగింది. అంతేనా అదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయి బయటికి కూడా వచ్చింది.


Video Source: NOIX LIFE

మాండ్య జిల్లాలోని ఓ గ్రామ పంచాయితీ ఆఫీసులో ఈ ఘటన జరిగింది. గ్రామ సర్పంచ్ తన ఆఫీసులో పనిచేస్తున్న ఒక మహిళ ఉద్యోగినిపై కన్నేశాడు. ఆఫీసులో ఎవరూ లేని సమయంలో బలవంతంగా చీర లాగి అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటిస్తున్నప్పటికీ తన కబంధ హస్తాలతో ఆమెను ఎత్తుకెళ్లి పాడుచేయాలని చూశాడు. అయితే ఎలాగోల తప్పించుకున్న ఆమె స్థానికుల సహాయంతో సర్పంచ్ ను నిలదీసింది. దీనికి అతగాడు తాను అమాయకుడినని, ఏ పాపం తెలీదని బుకాయించాడు. అక్కడున్న సీసీపుటేజ్ లను తీసి ఆ దుర్మార్గుడి చర్యను పోలీసులకు చేరవేశారు. దీంతో పోలీసులు ఆ నీచుడిని జైల్లో పెట్టారు. ఈ మధ్య బెంగళూర్ లో హస్టల్ బయట ఫోన్ మాట్లాడుతున్న యువతిని అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తి  ఎత్తుకెళ్లి రేప్ చేయాలని ప్రయత్నించడం, ఆ వ్యవహారం కూడా సీసీ టేజీ ద్వారానే బయటికి రావటం విదితమే.   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rape attempt  Bangalore government office  CCTV footage  sarpanch arrested  

Other Articles