సందట్లో సడేమియా | two year celebrations turn to election campaign

Modi two year celebrations turn to election campaign

two year celebrations turn to election campaign, narendra modi, two years celebrations, upcoming election states, మోదీ రెండేళ్ల పాలన సంబురాలు, బీజేపీ ప్రభుత్వం, modi news, national news, political news, latest political news, latest mews

two year celebrations turn to election campaign. modi two years celebrations highly concentrate in upcoming election states. key leaders taking responsible in those states.

సందట్లో సడేమియా

Posted: 05/26/2016 05:15 PM IST
Modi two year celebrations turn to election campaign

నమో పాలన రెండేళ్లు పూర్తి చేసుకుంది. సాధ్యాసాధ్యాలను, పథకాల అమలులో విజయాలను పక్కనబెడితే సాధారణ ప్రజానీకం చేత జస్ట్  ‘ఓకే’ మార్కులు వేయించుకుంది ఎన్డీయే ప్రభుత్వం. మెజార్టీ శాతం విదేశీ పర్యటనలకే  అంకితమవటం మైనస్ కాగా, ప్రతిపక్షాల ప్రశ్నించలేని తత్వం ఆయనకు పెద్ద ఫ్లస్ గా మారింది. ఈ నేపథ్యంలో నిర్వహించబోయే రెండేళ్ల ఉత్సవాలు వచ్చే మూడేళ్ల పాలనపై ఏ మాత్రం ప్రభావం చూపలేదన్నది అందరికీ తెలిసిందే. చరిత్రలో ఇలా విజయోత్సవాలు నిర్వహించిన దాఖలాలు లేనప్పటికీ సాధించామంటూ చూపించుకోవటం ఏ ప్రభుత్వానికైనా అవసరమే కదా. మొత్తం 198 నగరాల్లో వేడుకలను నిర్వహించేందుకు కమలనాధులు సిద్ధపడుతున్నారు. ఇందుకోసం జాతీయ నేతృత్వంలోని 33 బృందాలు కసరత్తు చేస్తున్నాయి. సభలు, ర్యాలీలు నిర్వహించడంతోపాటు ఈ రెండేళ్లలో సాధించిన విజయాలను ప్రచార చిత్రాలుగా రూపొందించి ప్రదర్శించనున్నారు. అంతేకాదు మరో అడుగుముందుకు వేసి గ్లామర్ అద్దేందుకు బిగ్ బి అమితాబ్ తోపాటు ఖాన్ త్రయాన్ని ఒకే వేదికపైకి తెస్తున్నారు. దేశ ప్రజల దృష్టిలో ఇది అరుదైన ఫీటే అని బీజేపీ ఉద్దేశ్యం కాబోలు.

ఇక నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామన్న ప్రధాన స్లోగన్ ను ప్రజల మెదళ్లో బలంగా నాటించి అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆపై అది ఆచరణ సాధ్యం కాదని తెలిసి కిక్కురు మనకుండా ఉంది. పనామా పేపర్లంటూ నల్లకుబేరుల జాబితాలు దశల వారిగా బయటికి వస్తున్న వాటిపై కూడా నోరు మెదపకపోవటం ఈ విషయంలో ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం. పోనీ పథకాల అమలులో అయిన సాధించిన విజయం ఏదైనా ఉందా అంటే దానికీ సమాధానం లేదు. ఉదాహరణకి స్వచ్ఛ్ భారత్ లాంటి పథకం ఉన్నతాశయంతోనే రూపుదిద్దుకుంది. దాని కోసం చేసిన దేశం చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. ఇక్కడి చెత్తను అక్కడ, అక్కడి చెత్తను ఇక్కడ పారబోయటం పక్కనబెడితే, సంస్థల నుంచి బలవంతపు వసూలు చేశారన్న ఆరోపణలు కూడా వినిపించాయి. ఇదే బాటలోనే మిగతా పథకాల పరిస్థితి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో సంబురాలు చేసుకోవటం ఒకరకంగా మోదీ ప్రభుత్వానికి ఇబ్బందికర పరిస్థితే అని చెప్పుకోవాలి. ఆర్థిక పురోగతి, ఉగ్రవాద నిరోధక చర్యలు ఇలా అన్నింట్లో విఫలమైనప్పటికీ అచ్చెదిన్ నడుస్తున్నాయంటూ వేడుకలు చేసుకోవటం ద్వారా ప్రజల్లోకి ఏం సందేశాన్ని తీసుకెళ్తాయన్నది బేరిజు వేసుకుని ముందుకు వెళ్తే బావుండేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే వరుసగా రానున్న రాష్ట్రాల ఎన్నికల ప్రచారం కోసం ఈ సభలను వాడుకుంటుదేమోనన్న అనుమానాలు ఒకింత కలగక మానదు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న ఐదు రాష్ట్రాల్లోనే ఈ హడావుడి ఎక్కువగా ఉండటం కాకతాళీయం అని అస్సలు అనుకోలేం. వాటికోసం ప్రధాన నేతలకు బాధ్యతలను అప్పజెప్పటం ఈ విషయాన్ని చెప్పకనే చెబుతోంది. మొత్తం మీద పాలన విజయోత్సవాల పేరుతో ఇలా ఎన్నికల ప్రచారం నిర్వహించడం బహుశా మోదీ సర్కార్ కు తప్ప మరెవరికి సాధ్యం కాదేమో!   

భాస్కర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM narendra modi  two years ruling  celebrations  

Other Articles