షాక్ కి గురిచేస్తున్న చిన్నారి వీడియో | Navymumbai child caught on camera

Navymumbai child caught on camera

Navi Mumbai, child theft, CCTV footage, నేవీ ముంబై, చిన్నారి, దొంగతనం, సీపీపుటేజ్, national news, latest news

In Navy Mumbai a little girl stealing a wad of cash from a locked drawer in a restaurant, while three women keep the shopkeeper engaged. That was what CCTV cameras recorded. police and shop owner shocked.

ITEMVIDEOS: షాక్ కి గురిచేస్తున్న చిన్నారి వీడియో

Posted: 05/26/2016 02:02 PM IST
Navymumbai child caught on camera

శిక్షణతో మనిషి రాటుదేలడం సహజం. అయితే అది మంచి అయినా, చెడు అయినా సరే. కానీ, సరిగ్గా పట్టుమని పదేళ్లు లేని ఓ పాపకు వారిచ్చిన ట్రెయినింగ్ ఏపాటిదో తెలీదుకానీ, ఆమె చూపిన పనితనానికి మాత్రం సలాం కొట్టడం ఖాయం. ఇంతకీ ఆ పాప చేసింది ఏ ఘనకార్యమో తెలిస్తే మీరూ ముక్కున వేలేసుకుంటారు. ఓ షాపింగ్ మాల్ లోని సీసీ పుటేజ్ ద్వారా అసలు విషయం బయటపడగా అది చూసి పోలీసులు సైతం షాక్ కి గురయ్యారు.

నిత్యం రద్దీగా ఉండే నవీముంబైలోని ఓ షాపింగ్ సముదాయం అది. అందులో ఓ ఫేమస్ రెస్టారెంట్, ఇంతలో ముగ్గురు మహిళలు అక్కడికి వచ్చారు. ఓనర్ తోసహా అక్కడున్న వారందరినీ తమ మాటల్లో ముంచారు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదుగానీ ఓ చిన్నపాప సడన్ గా క్యాష్ కౌంటర్ దగ్గర తేలింది. దాన్ని తెరిచేందుకు ప్రయత్నించగా, తాళం వేసి ఉండటంతో వీలుపడలేదు. అయినా బెదరలేదు పక్కనే తాళాలు ఉండటం గమనించి ఈజీగా కౌంటర్ ను తెరిచి అందులోని నగదును తీసి అక్కడి ఉడాయించింది. పాప కనబడకుండా అక్కడున్నంత సేపు ఆ మహిళలు గొడలా అడ్డుగా నిలుచున్నారు. వారు వెళ్లాక క్యాష్ కౌంటర్ చూసుకున్న యజమాని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. సీసీ పుటేజీ పరిశీలించిన పోలీసులు ఆ చిన్నారి గజదొంగను, ఆ బ్యాచ్ సమీపంలోని ఓ రైల్వే స్టేషన్ లో అదుపులోకి తీసుకున్నారు. ఆడిపాడాల్సిన వయసులో ఇలా సినీ ఫక్కీలో దొంగతనాలు చేసే ముఠాతో చేరి చేతివాటం చూపి చివరికి పోలీసులకు చిక్కింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : child theif  navymumbai  CCTV footage  

Other Articles