Doubt Modi did BA from DU, certificate published in newspaper forged: Arvind Kejriwal

Modi doesn t have du degree alleges kejriwal

arvind kejriwal, delhi chief minister, narendra modi degrees, delhi university, Ahmedabad University, BA degree, aam aadmi party chief,Narendra Modi, Prime Minister, Gujarat, educational qualifications, MA, Anandiben Patel, Arvind Kejriwal, Central Information Commission (CIC), RTI, Gujarat University, Political Science, Education,

Delhi Chief Minister Arvind Kejriwal alleged that Prime Minister Narendra Modi does not have a BA degree from Delhi University (DU).

‘‘నరేంద్ర మోడీ అ డిగ్రీలన్నీ ఫోర్జరీవే..’’

Posted: 05/04/2016 04:24 PM IST
Modi doesn t have du degree alleges kejriwal

భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పలు డిగ్రీలు పూర్తి చేశారంటూ పలు ప్రతికలు ప్రచురించిన డిగ్రీలు ఫోర్జరీవని ఢిల్లీ ముఖ్యమంత్రి, అమ్ అద్మీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ అనుమానాలు వ్యక్తం చేశారు. తనకు తెలిసిన సమాచారం మేరకు ప్రధాని ఆయా ప్రాంతాల్లోని విశ్వవిధ్యాలయాల నుంచి డిగ్రీలు పూర్తి చేయలేదని తెలిపారు. ఈ మేరకు ఆయన ప్రధాని డీగ్రీల విషయమూ మరోమారు ట్వట్టర్ ను అనుసంధానం చేసుకుని ప్రశ్నల కురిపించారు. ప్రధాని నిజంగా డిగ్రీలు పూర్తి చేసి వుంటే ఆయన వాటిని తన ట్విట్టర్ అకౌంట్, పేస్ బుక్ అకౌంట్లలో పెట్టి తన సచ్ఛీలతను నిరూపించుకోవాలని సూచించారు.

దేశ ప్రజలకున్న ఆసక్తి మేరకు సోషల్ మీడియాలో అన్ని ఫోటోలను వెనువెంటనే అప్ లోడ్ చేసే ప్రధాని.. ఈ అంశంలో ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు, తనపై కూడా ఐఐటీ ఖరగ్‌పూర్‌‌ నుంచి డిగ్రీ పోందలేదన్న వాదనలు వచ్చాయన్నారు, అయితే తన డిగ్రీల గురించి ప్రశ్నించిన కొంతమందికి, వెంటనే తాను తన డిగ్రీ సర్టిఫికెట్లను చూపించి రుజువు చేసుకున్నానని అన్నారు. తనకు అక్కడి నుంచి డిగ్రీ ఉందని కూడా తెలిపారు. త,న మాదిరిగానే ప్రధాని కూడా వెనువెంటనే వాటిని చూపించి రుజువు చేసుకోవాలని సూచించారు.

సుర్బజిత్ రాయ్ అనే వ్యక్తి ఐఐటీ ఖరగ్‌పూర్‌ను సమాచార హక్కు చట్టం ప్రకారం కేజ్రీవాల్ విద్యార్హతల గురించి ప్రశ్నించగా అక్కడి నుంచి వచ్చిన లేఖను కూడా ఆయన తన ట్వీట్‌తో పాటు జతపరిచారు. తన డిగ్రీల గురించి ఖరగ్‌పూర్ ఐఐటీ ఇంత స్పష్టంగా చెబుతోందని, కానీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిగ్రీల గురించి ఢిల్లీ యూనివర్సిటీ ఎందుకు దోబూచులు ఆడుతోందని ప్రశ్నించారు. ఎందుకంటే, ఆయనకు డిగ్రీలు లేవని కూడా కేజ్రీవాల్ సూత్రీకరించేశారు. ఆయన యూనివర్సిటీలో చేరడం, ఆయన డిగ్రీ, మార్కుల జాబితా, స్నాతకోత్సవం.. ఇలాంటి వాటికి సంబంధించిన రికార్డులు ఏవీ ఢిల్లీ యూనివర్సిటీలో లేవని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles