హిందూ దేవాలయాలు కూల్చం | Will not allow destruction of temples in Pakistan

Will not allow destruction of temples in pakistan

Hindu, Teamples, Muslims, Hafiz Saeed, Terrorist, Jammu Kashmir, జమ్ము కాశ్మీర్, హిందు దేవాలయాలు, హఫీజ్ సయిద్

Chief of Pakistan's banned JuD, Hafiz Saeed, has said his organisation will not allow the destruction of Hindu temples and other holy places belonging to the non-Muslims in the country.

హిందూ దేవాలయాలు కూల్చం

Posted: 05/03/2016 04:22 PM IST
Will not allow destruction of temples in pakistan

భారత్ పై విషప్రచారం చేస్తూ, భారత స్ధావరాలపై పదే పదే ఆత్మాహుతి దాడులకు తెగబడుతూ, రక్తపాతం సృష్టిస్తోన్న ఉగ్రవాద సంస్థ జమాతే ఉద్ దావా (జెయుడి) అధిపతి హఫీజ్ సయీద్ శాంతివచనాలు పలుకుతున్నాడు. హిందువులందరూ తమ సోదరులేనని, హైందవ ఆలయాలను ధ్వంసం చేయడం తప్పు అని, పాక్ లో ఉన్న ఏ కోవెలనూ కూలగొట్టబోమని అంటున్నాడు. హిందూ సోదరుల ఆలయాలను సంరక్షించడం ప్రతీ ముస్లిం బాధ్యత అని హఫీజ్ సయీద్ అని అనడం వార్తల్లో నిలిచింది.

హిందూ ఆలయాలను కూలగొడితే అడ్డుకుంటాం. హిందువులు సహా ఈ దేశంలోని ముస్లిమేతర ప్రజానీకం దర్శించే ప్రార్థనా స్థలాలు వేటినీ ఎవ్వరూ ధ్వంసం చేయరాదు. అలా చెయ్యమని ఇస్లాం చెప్పదు. వాటిని కాపాడాల్సిన బాధ్యత మనదే అని ఆయన అన్నట్లు తెలిసింది. విద్వేషాన్ని తమ సంస్థ ప్రచారం చేయట్లేదని అంటూ భారత సరిహద్దు ప్రాంతమైన థార్ ప్రాంతంలో తాము ఎలాంటి ఉగ్రవాద కార్యకలాపాలూ చేపట్టలేదన్నారాయన. కాశ్మీరీలకు సంఘీభావం ప్రకటించాం. భారత సైన్యం చేతిలో చనిపోతున్న కాశ్మీరీ ముస్లింల పక్షాన పోరాడుతున్నామని ఆయన చెప్పుకొచ్చారు. మొత్తానికి ఉగ్రవాద కార్యకలాపాలు ముందుండి నడిపించే వ్యక్తులు కూడా ఇలా లౌకికవాదాన్ని ఎత్తుకోవడం నిజంగా ఆశ్చర్యమే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles