Destablising states for power not acceptable, Shiv Sena to BJP

Pm should stay in india worry about indians says shiv sena

shiv sena, uddhav thackeray, shiv sena against bjp, bjp, congress attacks shiv sena, shiv sena supports kanhaiya, shiv sena saamna,Shiv Sena, Narendra Modi, Kanhaiya Kumar, OLX, saamna

The Uddhav Thackeray-led party can criticise BJP as much as it wants, but only after regaining its diminishing self- respect, it said.

ప్రధాని మోడీపై మరోమారు విమర్శలు గుప్పించిన మిత్రపక్షం..

Posted: 04/25/2016 06:01 PM IST
Pm should stay in india worry about indians says shiv sena

బీజేపి మిత్రపక్షం శివసేన మరోమారు ప్రధాని నరేంద్రమోడీని టార్గెట్ చేస్తూ విమర్శల వర్షం కురిపించింది. ఆయన విదేశీ పర్యటనలకు ప్రాధాన్యం ఇస్తూ దేశ ప్రజల సమస్యలను విస్మరిస్తున్నారని శివసేన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది. ఎన్నికలకు ముందు నరేంద్రమోదీ చాలా హామీలు గుప్పించారు కానీ వాటిలో ఏ ఒక్కటీ అమలుకు నోచుకోలేదని దుయ్యబట్టింది. విదేశాల్లోని నల్లధనం తీసుకొస్తానని, ప్రతి ఏడాది రెండు కోట్ల ఉద్యోగాలు సృష్టస్తానని, నిత్యావసర సరుకుల ధరలను అదుపులో వుంచుతామని, అచ్చెదిన్ (మంచిరోజులు) తీసుకొస్తానని ఇలా చాలా హామీలు గుప్పించారని వాటిలో ఎన్ని అమలయ్యాయో వారే సమీక్షించుకోవాలని సూచించారు.

ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి దాదాపుగా రెండేళ్లు కావస్తున్నా తన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని శివసేన మండిపడింది. అందువల్లే కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా మోదీని ఓఎల్ఎక్స్ లో అమ్మేస్తామని హెచ్చరిస్తున్నారని'.. ప్రధాని మోదీపై మిత్రపక్షం శివసేన వ్యంగ్యాస్త్రాలను సంధించింది. శివసేన అధికార పత్రిక 'సామ్నా' ప్రధాని మోదీ టార్గెట్ గా ఓ సంపాదకీయాన్ని వెలువరించింది. మోదీ వైఫల్యం వల్లే జెఎన్ యూ విద్యార్థి నేత అయిన కన్హయ్యకుమార్ లాంటి చిన్నాచితక నేతలు కూడా ఆయనను విమర్శిస్తున్నారని మండిపడింది.

పాత వస్తువులు అమ్మే ఓఎల్ఎక్స్ లో ప్రధానిని అమ్మేస్తామని కన్హయ్య లాంటి నేతలు కూడా విమర్శలు చేస్తున్నారని, ఇది బీజేపీకి ఆమోదయోగ్యం కాకూడదని పేర్కొంది. కన్హయ్య లాంటి నేతలకు బీజేపీ ఊపిరి అందిస్తున్నదని, ఇప్పటికైనా ఆ పార్టీ ఆత్మవిమర్శ చేసుకొని ముందుకు సాగాలని సూచించింది. కన్హయ్యపై జెట్ విమానంలో హత్యాయత్నం జరిగిందన్న వార్తల నేపథ్యంలో అతనిపై దేశద్రోహి ముద్ర వేసి ప్రచారం చేయడం ఎంతమాత్రం సబబు కాదని బీజేపీని ఉద్దేశించి శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్న సంగతి తెలిసిందే.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shiv Sena  Narendra Modi  Kanhaiya Kumar  OLX  saamna  

Other Articles