yelamanchali handicraft artist carved lord sita rama lakshman idols on rice grain

Sita rama lashmana idols carved on rice grain

handicraft artist srisailam chinnaiah chary, national award winner srisailam chinnaiah chary, yelamanchali yetikoppaka srisailam chinnaiah chary, lord sita rama lakshman idols on rice grain, srisailam chinnaiah chary, national award winner, handicraft artist, lord sriram idols, rice grain

national award winner yelamanchali yetikoppaka villager handicraft artist srisailam chinnaiah chary carved lord sita, rama, lakshman, anjaneya idols carved on rice grain

బియ్యపు గింజపై సీతారామ లక్ష్మణ హనుమంతులు..

Posted: 04/15/2016 09:57 AM IST
Sita rama lashmana idols carved on rice grain

అత్యద్భుత కళాకారుడి జాబితాలో చేరిన విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి మండలం ఏటికొప్పాక గ్రామానికి చెందిన హస్తకళాకారుడు శ్రీశైలపు చిన్నయాచారి చేతిలో మరో కళాఖండం రూపుదిద్దుకుంది. శ్రీరామ నవమి, రాములవారి జయంతిని పురస్కరించుకుని ఆయన మరో అద్భుతమైన కళాఖండాన్ని రూపొందించారు, అణువంత వుండే బియ్యపు గింజలపై అద్భుతమైన కళాఖాండాలను రూపొందించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. తన కళ నుంచి రూపోందించిన అద్భుత కళాఖండాలకు గాను భారత ప్రభుత్వం అయనకు జాతీయ అవార్డు అందించి సత్కరించింది.

తాజాగా, శ్రీరాముల జన్మదినం పురస్కరించుకుని తాటిముల్లుతో ఆయన తయారు చేసిన ఆంజనేయ సహిత సీతారామ లక్ష్మణుల కళాఖండం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నది. ఈ బొమ్మలు ఒక్కొక్కటీ 0.5 మిల్లీమీటర్లు ఉండగా, నాలుగు ప్రతిరూపాలూ కలిపి 3 మిల్లీమీటర్ల సైజులో ఉన్నాయి. వీటిని తయారు చేయడానికి రోజుకు 12 గంటలచొప్పున 8 రోజులపాటు శ్రమించినట్టు చిన్నయాచారి తెలిపారు. అచ్చంగా భద్రాచలంలో శ్రీ సితారామ లక్ష్మణ అంజనేయుల మూర్తులను మూర్తీభవించేలా వుండటంతో వాటిని అనేక మంది వీక్షిస్తున్నారు.

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles