With repo cut and MCLR, money is significantly cheap now: RBI Governor Raghuram Rajan

Rbi cuts repo rate by 25 bps to 6 50 per cent crr unchanged

RBI governer rajan, RBI policy review, SDR, RBI, Raghuram Rajan, MCLR, repo rate, reverse repo rate, CRR, interest rate cut, RBI monetary policy, Kingfisher Airlines

MUMBAI: Stating that borrowing rates will come down further, RBI Governor Raghuram Rajan today said the 0.25 per cent rate cut should be looked in conjunction with the new loan pricing method that has already resulted in lending rates coming down by up to 0.50 per cent.

లోన్ తీసుకునే వారికి శుభవార్త.. రెపో రేటు, రివర్స్ రెపో రేటు పావు శాతం తగ్గించిన ఆర్బీఐ

Posted: 04/05/2016 08:49 PM IST
Rbi cuts repo rate by 25 bps to 6 50 per cent crr unchanged

రుణాలను పోందాలనుకునే వారికి ఇది శుభవార్త, ముఖ్యంగా ఇంటి నిర్మాణ, కొనుగోలు రుణాలను తీసుకోవాలని భావిస్తున్న వారికి, కారు కొనుగోలు రుణాలను పొందాలనుకుంటున్న వారికి ఇది నిజంగా శుభవార్తే, ఎందుకంటే ఆర్బీఐ రుణ గ్రహితలపై పడే వడ్డీని పావు శాతం మేర తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులకు  శుభవార్త అందించే క్రమంలో ఆర్బీఐ. గృహ, కారు రుణాలకు మేలు చేకూరేలా కీలక వడ్డీరేట్లను తగ్గిస్తూ ఆర్బీఐ గవర్నర్ రఘురామ రాజన్ మంగళవారం నిర్ణయం తీసుకున్నారు.

ప్రతీ మూడు నెలలకో పర్యాయం ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలోని కమిటీ ద్రవ్య పరపతి సమీక్షను నిర్వహించే వడ్డీ రేట్లను సమీక్షిస్తుంది, అందులో భాగంగా ఇవాళ సమీక్షించిన కమిటీ రెపో రేటును 25 బేసిక్ పాయంట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, దీంతో రెపో రేటు 6.75 బేసిక్ పాయింట్ల నుంచి 6.50 పాయంట్ల వద్ద నిలిచింది, కాగా రివర్స్ రెపో రేటును కూడా 25 బేసిక్ పాయింట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది, అయితే నగదు నిష్పత్తి నిల్వలను మాత్రం ఎలాంటి మార్పులు లేకుండా నాలుగు శాతం వద్ద కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది,

ఈ నేపథ్యంలో తక్కువ వడ్డీ రేట్లకే గృహ, వాహన రుణాలు వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. బ్యాంకులు ఆర్బీఐ దగ్గర తీసుకునే రుణాలపై వడ్డీరేట్లు తగ్గించిన రాజన్, ఆర్బీఐ దగ్గర ఉంచే నగదు నిల్వలపై వడ్డీరేట్లను పావు శాతం పెంచుతున్నట్టు మంగళవారం ప్రకటించారు. అంచనాల కనుగుణంగానే రెపో రేటు ను పావు శాతం తగ్గించిన  రాజన్ రివర్స్ రెపోను పావు శాతం పెంచి విశ్లేషకులను  ఆశ్చర్యపరిచారు. రాజన్ తీసుకున్న ఈ నిర్ణయంతో  వినియోగదారులకు రుణాలివ్వడానికి మరిన్ని నిల్వలు తక్కువ వడ్డీకి అందుబాటులోకి  రానున్నాయి. ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు అందేలా బ్యాంకులు వెంటనే చర్యలు చేపట్టాలని రాజన్ ఆదేశించారు.  

మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : RBI  Raghuram Rajan  MCLR  repo rate  reverse repo rate  CRR  interest rate cut  

Other Articles