‘Good boy’ Sanjay Dutt said no to prison uniform, was sternly rebuked

Good boy sanjay dutt needed stern words to wear jail uniform

Sanjay Dutt,Sanjay Dutt released,Yerwada Central Prison, pune yerawada jail, mumbai arthur road jail, prison uniform, Bollywood actor Manyata Dutt Yerwada prison, swati sathe, maharastra jail dig

Though Sanjay Dutt availed of remission for “good behaviour”, the Bollywood actor was averse to wearing prison uniform while in the Arthur Road jail in Mumbai

ఈ భాయ్ మంచోడేనట.. కానీ మొదట్లో మాత్రం మొరాయించాడట..

Posted: 02/25/2016 02:26 PM IST
Good boy sanjay dutt needed stern words to wear jail uniform

ఆ భాయ్ అనుకున్నట్లు చాలా మంచోడు. అందుకే ఆయనకు విధించిన జైలు శిక్షాకాలాన్ని తగ్గించి మరీ విడుదల చేశారు యెర్రవాడ జైలు అధికారులు. అయితే మంచోడు కానీ మొదట్లో మాత్రం కాస్తంత మొరాయించాడని అధికారులు అసలు విషయాన్ని ఆయన విడుదలైన తరువాత మెల్లిగా చెప్పారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసు కదా.. సంజయ్ దత్. పుణె ఎరవాడ జైలుకు తరలించడానికి ముందు, నేరనిర్ధారణ అయిన తర్వాత ముంబై ఆర్థర్ రోడ్డు జైల్లో ఉండగా.. మన 'గుడ్‌బోయ్' సంజూ బాబా జైలు యూనిఫాం వేసుకోడానికి ససేమిరా అన్నాడట. ఆ జైల్లో ఉండగా జైలు యూనిఫాం వేసుకోడానికి అతడు నిరాకరించడంతో.. అధికారులు కాస్త కఠినంగానే వ్యవహరించాల్సి వచ్చిందని మహారాష్ట్ర జైళ్ల శాఖ డీఐజీ స్వాతి సాథె చెప్పారు.

ఎరవాడ సెంట్రల్ జైల్లో దత్ రోజూ ఏం చేసేవాడని అడిగినప్పుడు.. ఇతర ఖైదీల్లాగే రెగ్యులర్ డ్రిల్‌ను అనుసరించేవాడని ఆమె తెలిపారు. ఉదయం 5.30కి లేవడం, ప్రార్థన చేసుకోవడం, వ్యాయామం, తర్వాత టీ, టిఫిన్, తర్వాత ఆ రోజుకు కేటాయించిన పని చేయడం. మిగిలిన ఖైదీలు వర్క్ షెడ్‌కు వెళ్లి పని చేయగా, దత్ మాత్రం పేపర్ బ్యాగులు చేసేవాడని, భద్రతా కారణాల రీత్యా తన సొంత సెల్‌లోనే ఉండి ఈ పని చేసేవాడని ఆమె వివరించారు. జైల్లో ఉన్న ఇన్నర్ సర్క్యూట్ వైసీపీ రేడియోలో రేడియో జాకీ పాత్ర పోషించి.. ఇతర ఖైదీలను ఆహ్లాదపరిచేవాడని కూడా స్వాతి సాథె చెప్పారు. ఎరవాడ జైల్లో సంజయ్ దత్ 42 నెలల పాటు ఉన్నాడు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sanjay Dutt  Sanjay Dutt released  Yerwada Central Prison  

Other Articles