paripoornananda swami performs gopuja at lower tankbund

Paripoornananda swami perfomes gopuja on goraksha diwas

beef festival, Paripoornananda swami, goraksha diwas, Paripoornananda swami Gopuja, bjp mla raja singh, goshamahal mla raja singh, beef festival, osmania university, mla rajasingh arrested, bjp, telangana bjp president kishan reddy, trs, kcr, trs operation akarsh

paripoornananda swami performs gopuja at lower tankbund on goraksha diwas

గో రక్షణ దినోత్సవం, గోపూజ నిర్వహించిన పరిపూర్ణానంద స్వామి

Posted: 12/10/2015 10:26 AM IST
Paripoornananda swami perfomes gopuja on goraksha diwas

గో రక్షణ దినోత్సవాన్ని పురస్కరించుకుని శ్రీపీఠం పీఠాధిపతి శ్రీ పరిపూర్ణానంద సరస్వతి స్వామిజీ గో పూజను నిర్వహించారు. లోయర్‌ ట్యాంక్‌ బండ్‌ భాగ్యనగర్‌ గోశాలలో గురువారం ఆయన గోపూజ నిర్వహించారు. గోవులను పూజించడం సనాతన ధర్మమని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. .బీఫ్ ఫెస్టివల్ నిర్వహించాలన్న ఆలోచన రావడం దౌర్భాగ్యమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నుంచి డిసెంబర్ 10వ తేదీని గోరక్ష దివస్గా నిర్వహించాలని స్వామిజీ సూచించారు.

గో ఆధారిత వ్యవసాయంతోనే రైతుల ఆత్మహత్యలను నివారించవచ్చునని... తెలుగు రాష్ట్రాల్లో గోరక్ష క్రాంతి ఫథకం కింద రైతులకు ఆవులను పంపిణీ చేయాలని ప్రభుత్వాలను కోరారు. ఆవును ప్రజలు పశువుగా, జంతువుగా చూడకూడదని... ఆవు పాలు తాగితే మంచిదని...దీనిపై విస్తృత ప్రచారం జరగాలని స్వామిజీ సూచించారు. గోవధ అనే మాట పలకడమే పెద్ద నేరమని, దానికి 6 నెలల శిక్ష కూడా ఉందని ఆయన గుర్తు చేశారు. ఇప్పటికైనా చట్టాలను కఠినంగా అమలు చేయాలని పరిపూర్ణానంద స్వామిజీ  ప్రభుత్వాలను కోరారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paripoornananda swami  goraksha diwas  Gopuja  beef festival  

Other Articles