Kalti Ghee supply ro tirumala laddu rocket busted

Adulterated ghee used in tirumala laddu prasadam

Devineni Uma, Uma Maheswara Rao Devineni, Adulterated Ghee tirumala, kalti ghee tirumala, adultered ghee rocket, kalti ghee rocket, kalti ghee tirumala laddu, adultered ghee tirumala laddu, tirupathi laddu prasadam, tirumala laddu non veg ghee,

Devineni Uma responds over Adulterated Ghee used in Tirumala laddu, says stern action will be taken on accused

ITEMVIDEOS: శ్రీవారి ప్రసాదం ప్రవిత్రతకు భంగం.. ‘నాన్ వెజ్’ లడ్డూ

Posted: 12/02/2015 01:53 PM IST
Adulterated ghee used in tirumala laddu prasadam

కలియుగ దైవం తిరుమల శ్రీవారి ఎంతో ప్రీతిపాత్రమైన లడ్డూను సచి, సుచి పాటించి మడి కట్టుకున్న బ్రహ్మనోత్తముల చేత చేయిస్తారు. అయితే ఆనదిగా వస్తున్న ఈ అనవాయితీకి, లడ్డూ ప్రవిత్రకు భంగం వాటిల్లింది. సాక్ష్యాత్తు శ్రీవారికి మాంసాహారపూరితమైన లడ్డూలను నైవేద్యంగా పెట్టించారు కొందరు దుర్మార్గులు. తిరుమల కోండపై కొరవడిన నిఘా ఫలితంగా లడ్డూ కల్తీ అయిపోయింది. జంతువ్యర్థాలతో చేసిన నెయ్యితో ఇక్కడ లడ్డూలు తయారయ్యాయి. భక్తులు అత్యంత పవిత్రంగా భావించే సాక్షాత్తు తిరుమల శ్రీవారి లడ్డూను కల్తీ  చేస్తున్నారు. విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలోని అడవి నెక్కలం ఊరు శివారులో ఉన్న ఓ తోటలో స్థావరం ఏర్పాటు చేసుకుని కల్తీ  నెయ్యి తయారీ ప్రారంభించారు. పేరున్న కంపెనీ లేబుల్స్‌తో కల్తీ నెయ్యి ప్యాక్ చేసి సరఫరా చేస్తున్నారు.

ఈ ముఠా నాయకుడు ఆవుల ఫణికుమార్‌తో పాటు .. మరికొందర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా,. పోలీసులకు నిర్ఘాంతపోయే నిజాలు బయటపడ్డాయి. తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా కల్తీ నెయ్యిని సరఫరా చేసినట్లు బయటపడింది. జంతు వ్యర్థాలతో తయారుచేసిన డాల్డాతో తయారైన ఈ నెయ్యిని తిరుమల శ్రీవారి మహా ప్రసాదమైన లడ్డూ తయారీకి కూడా గతంలో పంపారనే ఆరోపణలు వస్తున్నాయి. 2013లో టీటీడీ... నెయ్యి కోసం.. ఆవుల ఫణికుమార్ ముఠాకు ఆర్డర్ ఇచ్చింది. లడ్డూ తయారీకి నెయ్యి కూడా సరఫరా అయ్యింది. అయితే టీటీడీ క్వాలిటీ కంట్రోల్ ప్రమాణాలకు అనుగుణంగా లేదని ఆ నెయ్యిని తిరస్కరించామని టీటీడీ హెల్త్ విభాగం అధికారి స్పష్టం చేశారు.

పరమ పవిత్రంగా భావించే శ్రీవారి ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి ఉపయోగించారా లేదా అనేది నిర్థారణ కాలేదు. అయితే 2013 తరువాత వేరే కంపెనీ పేరుతో ఫణికుమార్ టీటీడీకి నెయ్యి సరఫరా చేశాడా ? తిరస్కరించిన నెయ్యి స్థానంలో మళ్లీ సరుకు పంపించాడా అనేది తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులకే తెలియాలి.  ఇదిలా ఉంటే కల్తీ నెయ్యి ముఠా వెనుక ఎవ్వరున్నా వదిలే  ప్రసక్తి లేదని మంత్రి దేవినేని ఉమ హెచ్చరించారు,. కల్తీ నెయ్యి ముఠా ఆట కట్టించాలని మంత్రి ఆదేశాలిచ్చారు. ఈ మాఫియాలో ఎవరి హస్తం ఉన్నా వదిలిపెట్టేది లేదనీ, దీనిపై లోతుగా దర్యాప్తు చేయాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్‌లకు ఆదేశాలు ఇచ్చారు.  


జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Devineni Uma  Adulterated Ghee  tirumala  kalti ghee  laddu  

Other Articles