The UN Framework Convention on Climate Change in Paris

The un framework convention on climate change in paris

Paris, climate change, climate, temperature, UN, COP21, Obama, Modi, Putin

The 21st Conference of the Parties to the UN Framework Convention on Climate Change (UNFCCC), COP 21, convenes in Paris, and a large number of heads of state/ government, including Prime Minister Narendra Modi, are expected to attend. There is hope that this latest climate summit will avoid the failure and frustration of the earlier summit in Copenhagen, in 2009. The assembled world leaders ought to be able to applaud a successful outcome on December 11, the last day of the conference, barring unforeseen deadlock on some pending issues.

నేలతల్లిని కాపాడేందుకు పారిస్ సదస్సు

Posted: 11/30/2015 10:22 AM IST
The un framework convention on climate change in paris

వాతావరణ మార్పులపై పారిస్ లో కీలకమైన సదస్సు నేడు  ప్రారంభం కానుంది. డిసెంబర్ 11 వరకు జరగనున్న ఈ కాప్ 21 భేటీకి దాదాపు ప్రపంచ దేశాల ప్రతినిధులంతా హాజరవుతున్నారు. భారత ప్రధాని మోడీ కూడా  పారిస్ చేరుకున్నారు. కాలుష్యం కోరలు చాస్తోంది..పర్యావరణం అస్తవ్యస్థమవుతోంది. అభివృద్ధి పేరిట మానవాళి సాగిస్తున్న అడ్డగోలు విధ్వంసం కారణంగా భూతాపం పెరుగుతోంది. ఇప్పుడిది జీవన్మరణ సమస్యగానూ మారింది. అస్తిత్వానికే పెనుముప్పుగా పరిణమించింది. ఇలాంటి సమయంలో పారిస్ వేదికగా జరుగుతున్న కాప్ -21 సదస్సు ప్రాధాన్యం సంతరించుకుంది.

పారిస్ లో నేడు ప్రారంభం కానున్న వాతావరణ మార్పుల సదస్సు పలు కీలక అంశాలను చర్చించనుంది. దాదాపు ప్రపంచ దేశాలన్నీ హాజరవుతున్న ఆ సదస్సు భవిష్యత్ పై భరోసాను ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకోనుంది. 2015 నాటికి కర్బన ఉద్గారాల విడుదలను నియంత్రించే ఒప్పందాన్ని సాధించాలని ఐక్య రాజ్య సమితి లక్ష్యంగా పెట్టుకుంది. పారిస్ లో జరుగుతున్న 21వ వార్షిక సదస్సులోనైనా ప్రపంచ దేశాలన్నీ చట్టపరంగా కట్టుబడి ఉండాల్సిన ఉద్గారాల కోతలకు అంగీకరిస్తాయని అంతా ఆశిస్తున్నారు. పారిస్ సదస్సులో పాల్గొనేందుకు అన్ని దేశాల అధినేతలు తరలివచ్చారు. అమెరికా ప్రెసిడెంట్ ఒబామా, భారత ప్రధాని నరేంద్ర మోడీ, ఇతర దేశాల ప్రతినిధులు ఇప్పటికే పారిస్ చేరారు. పుడమి తల్లి భవిత కోసం...భవిష్యత్ తరాల బాగు కోసం పారిస్ కాప్-21 సదస్సు మార్గ నిర్దేశనం చేయాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు పడాలని అందరూ ఎదురు చూస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Paris  climate change  climate  temperature  UN  COP21  Obama  Modi  Putin  

Other Articles