Ludhiana | man 'misbehaves' | bollywood singer | Alka Yagnik | allegedly-misbehaved

Ludhiana man misbehaves with singer alka yagnik

Ludhiana, man 'misbehaves, bollywood singer, Alka Yagnik, allegedly-misbehaved, Sutlej Club member, Bollywood singer Alka Yagnik, alcohol, Deputy commissioner Rajat Agarwal, Sutlej club president, Yagnik's manager.

A member of the Sutlej Club here allegedly misbehaved with Bollywood singer Alka Yagnik when she was in the city for a performance.

బాలీవుడ్ గాయిని అల్క తో అసభ్యంగా ప్రవర్తించిన తాగుబోతు

Posted: 10/27/2015 09:46 PM IST
Ludhiana man misbehaves with singer alka yagnik

బాలీవుడ్ సింగర్ అల్కా యజ్ఞిక్ కు పరాభవం ఎదురైంది. అమె ఎక్కడికి వెళ్తే అక్కడ అమెను రిసీవ్ చేసుకుని.. చక్కటి అతిథ్యం ఇచ్చి మరీ అమె సుమదుర గాత్రాన్ని అస్వాధించాలని అనేక మంది పోటీ పడుతుంటారు. ఇప్పటికే అలాంటి ఎన్నో కార్యక్రమాలలో పాల్గోని శ్రోతలను తన సుమదుర గానాలతో పరవశింపజేసింది కూడా. అయితే రానురాను అమెకు పాపులారిటీ మరిపెరిగిపోవడం, దీనికి తోడు సినిమాలలో అవకాశాలు కూడా అధికంగా రావడంతో.. అన్నీ కాకున్నా మచ్చకు కొన్ని అవుట్ డోర్ కార్యక్రమాలను మాత్రమే అంగీకరిస్తుంటుంది. అందులోనూ మంచి సంస్థలు నిర్వహించే కార్యక్రమాలను మాత్రమే ఒప్పుకుని పాడుతుంది.

అలా అంగీకరించిన ఓ కార్యక్రమాలో ఓ తాగుబోతు నుంచి చుక్కెదురైంది. పంజాబ్ లోని లుథియానాలోగల సట్ లెజ్ క్లబ్ లో అంగీకరించిన ఓ కార్యక్రమానికి అమె చేరుకున్నారు. ముందుగా అమె తనకు కేటాయించిన గదిలోకి వెళ్లి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో.. క్లబ్ మెంబర్ గా చెప్పుకుంటున్న ఓ తాగుబోతు అమె గదిలోకి వెళ్లి అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. పిచ్చిగా ప్రవర్తించడంతో పాటు తనతో ఫొటోలు దిగాలని బలవంతం చేశాడు. తాగుబోతు అభ్యంతరకర ప్రవర్తనతో విసుగెత్తిపోయిన అల్కా.. జరిగిన ఘటనపై  లుధియానా పోలీసులకు ఫిర్యాదు చేసింది. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని పట్టుకునేందుకు యత్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ludhiana  man 'misbehaves  bollywood singer  Alka Yagnik  allegedly-misbehaved  

Other Articles