nandamuri balakrishna demands special status for ap

Center would face severe consequences if not gives special status to ap

tollywood hero, balaiah on ap special status, balakrishna on ap special status, breast cancer awareness rally, kbr park breast cancer awareness rally, anjali, Hema, nandamuri balakrishna, balaiah, hindupuram mla, Andhra Pradesh special status issue

nandamuri balakrishna demands special status for ap says center would face severe consequences if not gives special status.

ఆ నమ్మకం వుంది.. లేదంటే తీవ్ర పరిణామాలే..!

Posted: 10/25/2015 12:39 PM IST
Center would face severe consequences if not gives special status to ap

నవ్యంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదా ఇస్తున్నందన్న నమ్మకం ఉందని ప్రముఖ సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు బాలకృష్ణ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ కోసం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నం  చేస్తోందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే తెలుగుజాతి ఆత్మ గౌరవానికి కేంద్రం కళంకం తెచ్చినట్టేనని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా వస్తేనే ఉపాధి అవకాశాలు పెరుగుతాయని బాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదాతో రాష్ట్రం అన్నివిధాలా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక హోదాఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు తప్పవని ఆయన హెచ్చరించారు.

ఆదివారం నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ వద్ద బ్రెస్ట్‌ క్యాన్సర్‌ అవగాహన ర్యాలీ జరిగింది. బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో బాలకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్యాన్సర్‌ చికిత్స కోసం అత్యాధునిక పరికరాలు, ఎంతో నైపుణ్యం ఉన్న డాక్టర్స్‌, సిబ్బంది, మంచి ఫ్యాకల్టీ ఉందని బాలకృష్ణ వెల్లడించారు. పేద, ధనిక తారతమ్యం లేకుండా తక్కువ ఖర్చుతో నాణ్యమైన చికిత్స అందజేస్తున్నామని ఆయన అన్నారు. కేబీఆర్‌ పార్క్‌ నుంచి బసవతారకం ఆస్పత్రి వరకు సాగిన ఈ ర్యాలీలో ఆస్పత్రి సిబ్బంది, సినీ నటులు అంజలీ, హేమ, స్పోర్ట్స్‌ పర్సన్‌ పుల్లెల గోపీ చంద్‌, ఛాముండేశ్వరీనాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles