Two inmates killed as clash breaks out in Tihar jail

Tihar jail gang war 2 killed 12 injured

Tihar Jail, Two inmates injured,Firing,Delhi,Tihar,TiharJail,Gang War Tihar Jail,Tihar InmatesDead,Tihar InmatesDead Gang War,2 Inmates Dead,12 Injured, Gang War,Delhi's Tihar Jail

Two inmates were killed and over a dozen undertrials and Tihar jail staff suffered critical injuries in a gang war inside the high-security prison, police said.

జైలులో పైచేయి కోసం గ్యాంగ్ వార్.. మరి పోలీసులేం చేస్తున్నారు..?

Posted: 10/08/2015 03:24 PM IST
Tihar jail gang war 2 killed 12 injured

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని తీహార్ జైల్లో పైచేయి కోసం పాకులాడుతున్న రెండు ఖైదీ గ్రూపుల మధ్య మరోమారు గ్యాంగ్వార్ చోటు చేసుకుంది. పలు నేరాలకు పాల్పడి.. తాము చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తున్నామన్న బాధ ఏ కోశాన లేని ఖైదీలు.. అటు జైలులో కూడా అధిపత్యాన్ని చాటుకునేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు. సరిగ్గా సినిమాలలో చూపినట్లుగానే జైళ్లలో గ్యాంగుల అధిపత్యాలు సాగుతున్నయన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రితం రోజు తీవ్ర ఉద్రిక్తత రేపిన ఈ గ్యాంగ్వార్లో ఇద్దరు ఖైదీలు హత్యకు గురయ్యారు. మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. దీంతో జైలు ఆవరణలో భయానక వాతావరణం నెలకొంది.  ఈ నేపథ్యంలో హై సెక్యూరిటీ ఏర్పాటు చేశారు.

పోలీసు ఉన్నతాధికారుల సమాచారం ప్రకారం... బుధవారం భోజన విరామం తరువాత  కట్టుదిట్టమైన భద్రత మధ్యుండే వార్డుకు చెందిన ఖైదీలు ఈశ్వర్, విజయ్, షాదాబ్ ను  జైలు ఆవరణలోని ఆరోగ్య కేంద్రానికి  వైద్య పరీక్షల నిమిత్తం తీసుకొచ్చారు. తిరిగి వార్డు తరలిస్తుండగా ఈ సంఘటన  చోటు చేసుకుంది. జైలు అధికారులు, పోలీసుల సమక్షంలోనే  ఖైదీలు అనిల్, వాసు, సందీప్ పరస్పరం దాడులకు దిగారు. మరోవైపు జైలు నెం. 1, 2 , 4  లకు చెందిన  ఖైదీలు  కూడా వీరికి జత కలిశారు.  దీంతో పరిస్థితి మరింత భయానకంగా మారిపోయింది.

ఈ ఘటనలో ఇరువర్గాలకు చెందిన అనిల్(20) ఈశ్వర్(20) అక్కడిక్కడే మరణించారని, సెక్యూరిటీ సిబ్బంది సహా  మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారని  పోలీసు ఉన్నతాధికారి ముఖేష్ ప్రసాద్ తెలిపారు. ఘర్ణణను అదుపు చేసే క్రమంలో జైలు సిబ్బంది కూడా గాయపడ్డారని చెప్పారు. క్షతగాత్రులను దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామన్నారు. సంబంధిత మంత్రిత్వ శాఖకు సమాచారం అందించి, పరిస్థితిని సమీక్షిస్తున్నామన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని ఆయన తెలిపారు. అయితే ఖైదీలు కట్టాన్ గా పిలిచే దేశీ పిస్టోలులతో కాల్పులకు కూడా తెగబడ్డారని, వీరికి ఆయుదాలు ఎలా సమకూరాయనే దానిపై కూడా పోలీసు ఉన్నతాధికారులు అరా తీస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : 2 Inmates Dead  12 Injured  Gang War  Delhi's Tihar Jail  

Other Articles