AP | Police | Vacancies | Chandrababu Naidu

Ap police department propose to fill seven thousand vacancies

AP, Police, vacancies, Chandrababu Naidu, Police jobs

AP Police department propose to fill seven thousand vacancies. AP govt may take decision on the vacancies in the department of police after ap assembly sessions.

ఏడు వేల పోలీస్ ఉద్యోగాల భర్తీకి అంతా సిద్దం

Posted: 09/01/2015 10:25 AM IST
Ap police department propose to fill seven thousand vacancies

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు శాఖలో ఏడు వేల ఖాళీలకు సంబందించిన ఫైల్ ను ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపించారు. ఈ పోస్టులలో ఎస్సై, డ్రైవర్లు, కానిస్టేబుళ్ళు, కుక్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసు శాఖపై పనిభారం పెరిగిన నేపథ్యంలో ఖాళీలు భర్తీ చేయడంతో పాటు మరిన్ని కొత్త పోస్టులు మంజూరు చేయాలంటూ రాష్ట్ర పోలీసు శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఈ ప్రతిపాదనకు స్పందించిన ప్రభుత్వం ఖాళీగా ఉన్న పోస్టులను వీలైనంత తొందరగా భర్తీ చేసేందుకు సుముఖత వ్యక్తం చేసింది. దీంతో అధికారులు ఖాళీల వివరాలను తెలియజేస్తూ సీఎం కార్యాలయానికి ఫైలును పంపించారు.

శాసనసభ సమావేశాలు ముగిసిన వెంటనే ఈ ఫైల్ మీద సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకోనున్నారని, వెనువెంటనే నియామకాల ప్రక్రియను ప్రారంభిస్తామని అధికారులు తెలిపారు. సిబ్బందిపై పనిభారం తగ్గించాల్సిన అవసరం ఉందని, లేకపోతే దుష్పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని ఇటీవల డీజీపీ జేవీ రాముడు నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో పేర్కొన్న నేపథ్యంలో ముందుగా ఖాళీల భర్తీకి ప్రభుత్వం నుంచి అనుమతి పొందాలని భావించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం హోంమంత్రి చినరాజప్పకు ఖాళీల నివేదికను పంపించగా, ఆయన సీఎం కార్యాలయానికి పంపించారు. పోలీసులకు సహాయకులుగా పని చేసే హోంగార్డుల నియామకంపై ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఖాళీలను భర్తీ చేస్తూనే కొత్త పోస్టుల కోసం ప్రభుత్వం ముందు ప్రతిపాదనలను పెట్టాలని అధికారులు భావిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP  Police  vacancies  Chandrababu Naidu  Police jobs  

Other Articles