Is guntur general hospital for people or for Rats..?

Heavy number of rats caught in guntur government hospital

heavy number of rats caught, rats killed baby boy in Guntur, rats bitten baby boy in GGH, GGH doctors try to escape from infant death, ggh doctors submit report to government, ggh doctors says rats are not only the reason to infant death, baby boy bitten twice by rats in ggh, baby boy death, doctors report, government, doctor venugopal rao, rat bite

As a part of hyginic measures taken after infant death.. heavy number of rats caught in guntur government hospital

శిశువు మృతితొ మేల్కోన్న అధికారులు.. గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో 50 ఎలుకల పట్టివేత

Posted: 08/28/2015 08:33 PM IST
Heavy number of rats caught in guntur government hospital

గుంటూరు ప్రభుత్వాసుపత్రిలో అధికారుల నిర్లక్ష్యం, అందులోనూ సిబ్బంది నిర్లక్ష్యంతో పది రోజుల శిశువు మృతి చెందడంపై పై పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో జిల్లా వైద్యాధికారులు దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న పసికందును ఎలుకలు కొరకడంతో మరణించిన ఘటన దేశ విదేశాలలో కూడా సంచలనం కలిగించింది. పలు అంతర్జాతీయ పత్రికలు కూడా ఈ విషయం గురించిన కథనాన్ని ప్రచురించాయి. జాతీయ మీడియా కూడా దీనిపై దుమ్మెత్తిపోసింది. దీంతో అధికారులలో ఎట్టకేలకు చలనం వచ్చింది.

గతంలో జిల్లా వైద్యాధికారులు ఈ ఆసుపత్రులలో అడపా తడపా తనఖీలు చేస్తున్నా.. ఎలుకలను చూసి చూడనట్టు వదిలేశారంటే.. వారి బాధ్యతారాహిత్యానికి ఈ ఘటన ధర్పణం పడుతోంది. గుంటూరు ఒక్కటే కాదు విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో గత మూడు దశాబ్దాలుగా లిఫ్ట్ పనిచేయడం లేదని ఇటీవల మంత్రి గంట ఆస్పత్రి తనిఖీలో వెలుగుచూపిన విషయం తెలిసిందే. ఇప్పటికే అటు ప్రభుత్వం పరువుతో పాటు ఇటు తమ సిబ్బందిని కాపాడుకునే పనిలో గుంటూరు వైద్యాధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తూ.. ప్రభుత్వానికి శిశువు మృతికి కారణాల ఎలుకలు కరవడమే కాదని అతనికున్న జబ్బని కూడా ప్రాధమిక నివేదిక ఇచ్చశారు.

ఈ ఘటనపై పెను దుమారం రేగడంతో తాము ఏం చెప్పినా ప్రజలు నమ్మెస్థితిలో లేరని తేలడంతో.. జిల్లా వైద్యాధికారులు ఎట్టకేలకు ఎలుకలను పట్టే చర్యలకు ఉపక్రమించారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లా నుంచి ప్రత్యేకంగా ఎలుకలు పట్టేవాళ్లను పిలిపించారు. మొత్తం పదిమందితో కూడిన ఓ బృందం ఆస్పత్రికి చేరుకుని, తమదైన పద్ధతిలో బోనులు, ఎరలు ఏర్పాటు చేసింది. దాంతో ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 50 వరకు ఎలుకలు పట్టుబడ్డాయి. వాళ్లు పట్టుకున్న ఎలుకలను చూసి.. అసలు ఇది గుంటూరు ప్రభుత్వాసుపత్రేనా.. లేక ఎలుకల ఆసుపత్రా.? అన్న అనుమానంతో స్థానికులు  విస్తుపోయారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : guntur general hospital  baby boy death  rat bite  

Other Articles