Prime Minister Modi Should Act on His Promises, Says Rahul Gandhi

Rahul to pm modi stop making commitments start taking action

Rahul Gandhi,Congress vice president,Prime Minister Narendra Modi,Rahul Gandhi visits Balakote,Rahul Gandhi slams Modi, rahul on modi, rahul on orop, rahul gandhi in jammu and kashmir

Congress Vice President Rahul Gandhi today accused Prime Minister Narendra Modi of centralising decision-making, and said he should act upon his promises.

ఇక ప్రసంగాలు, ప్రకటనలు చాలు.. ఇచ్చిన హామీలను నేరవేర్చు: మోడీకి రాహుల్ చురక

Posted: 08/26/2015 09:13 PM IST
Rahul to pm modi stop making commitments start taking action

దేశ సార్వత్రిక ఎన్నికల ముందు అధికారం వస్తే.. అందులోనూ పూర్తి మోజారిటీ వస్తే.. దేశంలో కాంతులు విరజిమ్మెల్లా చేస్తానని ప్రసంగాలతో ఊదరగొట్టిన మోడీ.. అచరణసాధ్యం కానీ హామీలను గుప్పించారని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. మోడీ ఇప్పటికీ ఎక్కడికి వెళ్లినా.. తన ప్రసంగాలతో, ప్రకటనలతో ప్రజలను మభ్య పెడుతున్నారని రాహుల్ ధ్వజమోత్తారు. ఇకపై ప్రధాని హామీలను గుప్పించడాన్ని మానుకుని దేశ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చితే చాలునని అన్నారు.

ఎన్నికలకు ముందు వన్ ర్యాంక్.. వన్ పెన్షన్ పై మాజీ సైనికులకు హామినిచ్చిన మోడీ అధికారంలోకి వచ్చి 15 మాసాలు కావస్తున్నా నోరు మెదపడం లేదెందుకు అని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. జమ్ముకాశ్మీర్ లో మూడు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ఇవాళ సరిహద్దులోని బాల్ కోట్ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ సరిహద్దు గ్రామాల ప్రజాలతో ఆయన భేట అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాలకోట్ ప్రాంతంలో ఉగ్రవాద దాడుల్లో ఆరుగురు మరణించిన గ్రామానికి వెళ్లి అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు.

అనంతరం  మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ దేశ రక్షణ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన జవాన్లు దేశ చరిత్రలోనే తొలిసారిగా ఆందోళన బాట పట్టారని, ఇలాంటి సమయంలో మోదీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. దేశంలో అవినీతి పెరుగుతోందని, సుష్మా స్వరాజ్, వసుంధర రాజే వ్యవహారంలో ప్రధాని ఒక్క మాటా మాట్లాడలేదన్నారు. ఇప్పుడు మాజీ సైనికులు ఆందోళన బాట పట్టారు.. మరొపక్క సరిహద్దుల్లో పాక్ సైన్యం కాల్పులకు తెగబడుతూనే ఉంది.. అయినప్పటికీ ప్రధాని మౌనంగానే ఉన్నారని దుయ్యబట్టారు. ఎన్నికల నాటి ప్రసంగాలు, హామీలు ఏమయ్యాయని, ప్రధాని మౌనం ఎందుకోసం అని రాహుల్ నిప్పులు చెరిగారు. బీజేపీలో ఒక పెద్ద మనిషి మాత్రమే మాట్లాడుతారు. ఒక పెద్ద మనిషి మాత్రమే వారి భావాలను చెప్తారు. ఒక పెద్ద మనిషి మాత్రమే వాగ్దానాలు ఇస్తారు. ఒక పెద్ద మనిషి మాత్రమే ఆ వాగ్దానాలను విస్మరిస్తారని ఇక ఎవరికీ అలాంటి అవకాశం వుండదని రాహుల్ ఘాటైన విమర్శలు చేశారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rahul Gandhi  Narendra Modi  Balakote  one rank one pension  

Other Articles