Pakistan Journalist Arif Jamal Says He Met Dawood Ibrahim In Karachi Twice | India Today Interview

Pakistan journalist arif jamal met dawood ibrahim in karachi india today interview

pak journalist arif jamal, dawood ibrahim, karachi, pakistan government, journalist arif jamal, arif jamal with dawood ibrahim, 1993 mumbai blasts, mumbai taj hotel blasts

Pakistan Journalist Arif Jamal Med Dawood Ibrahim In Karachi India Today Interview : In an interview with India Today, reputed Pakistani author and journalist Arif Jamal said that he met 1993 Mumbai serial blasts mastermind and most wanted underworld don Dawood Ibrahim in Karachi.

దావూద్ పై కుండబద్దలు కొట్టిన పాక్ జర్నలిస్ట్

Posted: 08/26/2015 10:36 AM IST
Pakistan journalist arif jamal met dawood ibrahim in karachi india today interview

1993 ముంబై పేలుళ్ళ ప్రధాన సూత్రధారి, అండర్ వాల్డ్ డాన్ అయిన దావూద్ ఇబ్రహీం తమ దేశంలో లేడంటూ పాకిస్తాన్ బకాయిస్తుండగా.. అతడు అక్కడే (కరాచీ) వున్నాడంటూ ఇటీవల భారత నిఘా వర్గాలు ఆధారాలతో తేల్చి చెప్పేశాయి. దీంతో బెంబేలెత్తిన పాక్.. వెంటనే అతనిని అక్కడి నుంచి వేరే చోటుకు షిఫ్ట్ చేసింది. అంతేకాదు.. ఇప్పటికీ ఇబ్రహీం తమ దేశంలో లేదంటూ పాక్ వాదిస్తోంది. అయితే.. పాక్ బకాయిస్తున్న ఈ వాదనలో ఏమాత్రం పసలేదని మరోమారు వెల్లడైంది. ఈ విషయాన్ని ఆ దేశానికే చెందిన పాక్ జర్నలిస్టే తేల్చి చెప్పడం విశేషం.

పాక్ దేశానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ ఆరిఫ్ జమాల్ ‘ఇండియా టుడే’కు ఓ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో భాగంగానే దావూద్ ప్రస్తావన తీసుకొచ్చిన ఆయన.. కరాచీలో ఉన్న అతనిని తాను రెండుసార్లు నేరుగా కలిశానని కుండబద్దలు కొట్టారు. ప్రస్తుతం అమెరికాలోని వర్జీనియాలో నివసిస్తున్న జమాల్ గతంలో ‘న్యూయార్క్ టైమ్స్’కు పాకిస్థాన్ లో కంట్రిబ్యూటర్ గా పనిచేశారు. కరాచీలో ఉన్న దావూద్ అతి కొద్ది మందిని మాత్రమే కలుస్తాడని జమాల్ తెలిపారు. ఇక దావూద్ పొరుగింటిలో అతడి సోదరుడు అనీస్ ఇబ్రహీం నివసిస్తున్నాడని కూడా అనీస్ జమాల్ పేర్కొన్నారు. అతగాడు చెప్పిన మాటల ప్రకారం.. దావూద్ పాక్ లోనే వున్నాడని అర్థమవుతోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pak journalist arif jamal  dawood ibrahim  1993 mumbai blasts  

Other Articles