Stock Market | India | China | Sensex | Nifty

What will happen in stock matket today

Stock Market, India, China, Sensex, Nifty, Crisis, America, Euro, Greece

What will happen in stock matket today. On Monday, the stock market posted its largest decline in years, sparking fear that the US is on the verge of another recession. After initially plunging 6.4 percent in a matter of minutes, it recovered some ground and ended the day down 3.6 percent.

నిన్న అంతా పోయింది.. మరి నేడు...?

Posted: 08/25/2015 08:53 AM IST
What will happen in stock matket today

అంతర్జాతీయ ప్రతికూల పరిణామాల నేపథ్యంలో నిన్న స్టాక్‌ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. దీంతో దేశీయ మదుపరుల సంపద దాదాపు ఏడు లక్షల కోట్ల మేర ఆవిరైపోయింది. చైనా ఆర్థిక వ్యవస్థలో స్తబ్ధత చోటు చేసుకుందన్న వార్తలకు తోడు అమెరికా తయారీ రంగంలో పతనం, గ్రీసులో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలన్నీ కలిసి ప్రపంచ దేశాల స్టాక్‌ మార్కెట్లను అతలాకుతలం చేశాయి. సోమవారం ఉదయం నుంచే ప్రపంచ స్టాక్‌ మార్కెట్లు వరుసగా పతనమవతూ వచ్చాయి. అవే భయాలను కొనసాగిస్తూ దేశీయ మార్కెట్లు కూడా భారీ కుంగుతూ వచ్చాయి. ఏ దశలోనే మార్కెట్లలో రికవరీ కనిపించలేదు. దేశీయంగా డాలర్‌తో రూపాయి మారకం విలువ మరింత కుంగి రూ.67 చేరువవడం కూడా పతనానికి మరింత ఆజ్యం పోసింది. ఫలితంగా బీఎస్‌ఈ సూచీ సెన్సెక్స్‌ 1,625 పాయింట్లు క్షీణించి 25,742కు పడిపోయింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్సేంజీ సూచీ నిఫ్టీ 491 పాయింట్ల మేర పతనమై 7,809 వద్ద స్థిరపడింది.

2009 జనవరి 7, తరువాత సెన్సెక్స్‌, నిఫ్టీలు వరుసగా 6.2 శాతం, 7.2 శాతం భారీ పతానాన్ని నమోదు చేయడం ఇదే తొలిసారి. పాయింట్ల వారిగా గమనిస్తే.. 2008 జనవరి 21 తర్వాత స్టాక్‌ మార్కెట్లు ఈ స్థాయిలో పడిపోవడం ప్రప్రథమం. అంటే..గత ఏడున్నర ఏళ్లలో ఈ స్థాయిలో మార్కెట్లు దిగజారడం ఇదే తొలిసారి. భారీగా పతనం వైపు జారుతున్న మార్కెట్లను నిలవరించేందుకు కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్‌ జైట్లీ, రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ రఘురాం రాజన్‌ స్వయంగా రంగంలోకి దిగి పరిస్థితులు సర్దుకుంటాయని, ఇవి తాత్కాలిక ప్రకంపనలేనని, త్వరలో వడ్డీరేట్లు తగ్గుతాయన్న సూచనలతో ప్రకటనలు చేసినప్పటికీ అవి మదుపర్లు విశ్వాసం నింపలేకపోయాయి. రూపాయి మారకం విలువ 89 పైసలు కోల్పోయి 66.71 వద్ద నమోదయ్యింది.

భారత స్టాక్‌ మార్కెట్ల నుంచి భారీగా విదేశీ సంస్థాగత మదు పరులు (ఎఫ్‌ఐఐలు) తరలిపోతురన్న సమాచారపు సంకేతాలు కూడా మార్కెట్‌ పతనానికి దారి తీశాయి. గడిచిన పార్లమెంట్‌ సమావేశాల్లో పెద్దగా సంస్కరణలు చోటు చేసుకోకపోవడానికి తోడు చైనా, అమెరికా ప్రభావాలే ఇందుకు కారణంగా విశ్లేషకులు చెబుతున్నారు. శుక్రవారం ఒకే రోజు రూ.2300 కోట్ల పైగా ఎఫ్‌ఐఐలు తరలిపోయాయని అంచనా. మొత్తానికి నిన్నటి దెబ్బకు దలాల్ స్ట్రీట్ కుదేలైంది. ఒక్క రోజులో ఏడు లక్షల కోట్ల రూపాయలు ఆవిరి కావడం ఇన్వెస్టర్లను కంటతడిపెట్టించింది. ఇక నిన్నటి పరిణామాలతో నేడు కూడా మార్కెట్ అదే పతనాన్ని కొనసాగిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Stock Market  India  China  Sensex  Nifty  Crisis  America  Euro  Greece  

Other Articles