n an opposition-less Lok Sabha, Sushma Swaraj refutes all charges in Lalit Modi row.

Sushma swaraj speaks on lalit modi row uninterrupted as opp continues boycott

sushma swaraj, lalit modi, lok sabha, congress, sumitra mahajan, parliament live, lok sabha live, lalit modi controversy, venkaiah naidu, lalit gate, parliament, Narendra modi

After days of protests and sloganeering by the opposition, Foreign Minister Sushma Swaraj spoke at length on the allegations made against her in the controversy surrounding former IPL boss Lalit Modi.

అది నేరమైతే.. పార్లమెంటు తీసుకునే చర్యలకు సిద్దమే : సుష్మాస్వరాజ్

Posted: 08/06/2015 08:17 PM IST
Sushma swaraj speaks on lalit modi row uninterrupted as opp continues boycott

లలిత్ గేట్ వ్యవహారంపై  కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్ గురువారం లోక్సభలో ఆవేశంగా ప్రసంగించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని ఆమె కొట్టి పారేశారు.  లలిత్ మెదీ విషయంలో తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. లలిత్ మోదీ కోసం తాను బ్రిటన్ ప్రభుత్వానికి ఎలాంటి సిఫార్సు చేయలేదన్నారు. సిఫార్సు చేసిన ఆధారాటు ఉంటే బయటపెట్టాలని, తనపై ఆరోపణలకు సంబంధించి చర్చ జరగాలన్నారు. లలిత్ గేట్పై కాంగ్రెస్ తో చర్చకు తాను సిధ్దమని స్పష్టం చేశారు.

కాంగ్రెస్తో చర్చకు తాను సిద్ధమే అని, వారి ప్రశ్నలకు సమాధానం తన వద్ద ఉందని తెలిపారు.  రెండు నెలలుగా తనపై మీడియాపై  దుష్ప్రచారం జరుగుతుందని సుష్మ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ఆరోపణలను తన దగ్గర ధీటైన సమాధానం ఉందని చెబుతున్నా, వారు సభా కార్యక్రమాలకు అడ్డుపడటం సరికాదన్నారు. తన స్థానంలో సోనియా గాంధీ ఉంటే ఏం చేసేవారని సుష్మా స్వరాజ్ ప్రశ్నించారు. లలిత్ మోడీ భార్య, భారతీయ నారి అని, అమె క్యాన్సర్ బారిన పడి చికిత్స సమయంలో తన భర్త తన పక్కనుండాలని కోరుకుందని.. దానికి సాయం చేస్తే కూడా రాద్దాంతం చేస్తున్నారని అమె మండిపడ్డారు.

మోదీ సతీమణికి సాయం చేయడం కూడా నేరమని భావించిన పక్షంలో తాను పార్లమెంటు తీసుకునే చర్యలకు బాధ్యరాలినవుతానని స్పష్టం చేశారు. లలిత్ మోదీకి సంబంధించిన అంశాన్ని బ్రిటన్ ప్రభుత్వానికే వదిలేశానని చెప్పారు. తాను లలిత్ మోడీకి వీసా కల్పించాలని సిఫార్స్ చేసినట్లు ఆధారాలు వుంటూ వాటిని విపక్షాలు తక్షణం భయటపెట్టాలని అమె డిమాండ్ చేశారు. ఈ అంశానికి సంబంధించిన విపక్ష నేతల వద్దనున్న మెయిల్, లేఖ ఉంటే చూపించాలని సుష్మా స్వరాజ్ ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతకుముందు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. దేశాభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మోకాలడ్డుతోందని ఆరోపించారు. 130 ఏళ్ల చరిత్ర ఉందని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకుంటోందని, లోక్ సభ స్పీకర్ను బెదిరించడం ఏ విలువలకు నిదర్శనం అని ఆయన ప్రశ్నించారు. ప్రతిపక్షమంటే ప్రభుత్వానికి సరైన సూచనలు ఇవ్వాలని హితవు పలికారు. అయినదానికి, కాని దానికి బ్లాక్ మెయిల్ చేయడం సరికాదని అన్నారు. పార్లమెంటు విలువలు కాపాడాల్సిన బాధ్యత ప్రతిపక్షానికి ఉందని, ప్రజల సమస్యలను చర్చించేందుకు అవకాశం ఇవ్వాలని చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sushma swaraj  venkaiah naidu  lalit gate  parliament  

Other Articles