telangana | Police Staion | Banappa

Mob attacked on west maredpally police station

telangana, Police Staion, Banappa, Custodial death, Marredpally police station, Hyderabad police officials, lathicharge

Mob attacked on west maredpally police station. The mob of a colony gandhinagar attacked on police station for their colony nighbour death.

ITEMVIDEOS: ఫోలీస్ స్టేషన్ మీద దాడి చేసిన బస్తీవాసులు

Posted: 08/04/2015 12:25 PM IST
Mob attacked on west maredpally police station

జంట నగరాల్లో ఎంతో వైభవంగా సాగుతున్న బోనాల్లో అపశృతి చోటుచేసుకుంది. పోలీసులు కొట్టడం వల్లేపోలీసులు కొట్టడం వల్లే ప్రాణాలు పోయాయనే ఆక్రోశంతో ఠాణాపై జనం దాడికి పాల్పడ్డారు. పోలీసుస్టేషన్ లోని ఫర్నీచర్, రికార్డులతో పాటు.. పోలీసు వ్యాన్, నాలుగు మోటారు సైకిళ్లను ధ్వంసం చేశారు. ఇద్దరు ఎస్సైలతో సహా ఐదుగురిపై దాడి చేశారు. దీనిపై పూర్తి స్థాయి విచారణకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. బోనాల ఉత్సవాల భద్రతకోసం వచ్చిన కరీంనగర్ కు చెందిన హోంగార్డు శ్రీనివాస్ హైదరాబాద్ వెస్ట్ మారేడ్ పల్లి గాంధీనగర్‌కు వచ్చాడు. ఉత్సవం వద్ద విధులు నిర్వహిస్తున్న తనపై బన్నప్ప దాడి చేశాడంటూ వెస్ట్ మారేడ్ పల్లి పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేశాడు. దాంతో వెంటనే బన్నప్పను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. స్టేషన్ బెయిలిచ్చి సోమవారం ఇంటికి పంపారు. సోమవారం మధ్యాహ్నం బన్నప్ప అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయాడు. దాంతో బసప్పను బంధువులు, పోలీసులు గాంధీ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు.. వెంటనే బన్నప్ప మృతదేహంతో స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. కట్టలు తెంచుకున్న ఆగ్రహావేశాలతో 200 మంది స్థానికులు మూకుమ్మడిగా వెస్ట్ మారేడ్ పల్లి పోలీసుస్టేషన్ పై దాడికి పాల్పడ్డారు.

విచక్షణారహితంగా పోలీసులు కొట్టడం వల్లే బన్నప్ప చనిపోయాడంటున్నారు మృతుని బంధువులు.. బన్నప్పను స్టేషన్ బెయిలివ్వడానికి 500 రూపాయలు పోలీసులు లంచం అడిగారని.. లంచమిచ్చి బన్నప్పను ఇంటికి తీసుకెళ్లేసరికి కొంతసేపటికే అపస్మారస్థితిలో ఉన్నాడని అంటున్నారు మృతుని బంధువులు.. బన్నప్ప ప్రాణాలు బలిగొన్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు బాధితులు. హోంగార్డు శ్రీనివాస్ పై దాడి చేయడంతోనే బన్నప్పను అదుపులోకి తీసుకున్నామని అంటున్నారు నార్త్ జోన్ డీసీపీ ప్రకాష్ రెడ్డి.. నిన్ననే బన్నప్పను స్టేషన్ బెయిలిచ్చి ఇంటికి పంపామని.. అతిగా మద్యంతాగడం వల్లే చనిపోయి ఉండొచ్చని.. పోలీసుల తప్పేమీ లేదంటున్నారు డీసీపీ ప్రకాష్ రెడ్డి.

attack-on-ps-at-west-maredp

దాడికి గురైన వెస్ట్ మారేడ్ పల్లి పోలీసుస్టేషన్ ను పరిశీలించారు హైదరాబాద్ సీపీ మహేందర్ రెడ్డి. అల్లరిమూకల దాడిలో దహనమైన వాహనాలు, స్టేషన్లోని ఫర్నీచర్ ను పరిశీలించారు. బన్నప్ప మృతి, పోలీసుస్టేషన్ పై దాడి ఘటనలను విచారణకు ఆదేశిచారు.. సీసీఎస్ పోలీసులు విచారణ జరుపుతారని... తప్పు పౌరులదైనా... పోలీసులదైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు సీపీ మహేందర్ రెడ్డి. క్లూస్ టీమ్ నిపుణులు చేరుకుని ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు. బాధితుడు చనిపోవడం.. ఠాణాపై దాడి జరగడం రెండూ ఘటనలూ బాధకరమేనంటున్నారు హైదరాబాద్ సీపీ.. చట్టాన్ని ఎవరు చేతుల్లోకి తీసుకున్నా తగిన చర్యలు తప్పవంటున్నారు కొత్వాల్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles