25 Congress Lawmakers Suspended From Lok Sabha | Sonia Gandhi | parliament of india

Speaker suspended 25 congress mp from parliament sessions

sonia gandhi, parliament of india, lok sabha, 25 congress suspended, speaker sumitra mahaja, parliament sessions, bjp party, speaker sumitra news

Speaker Suspended 25 Congress Mp From Parliament Sessions : Lok Sabha Speaker Sumitra Mahajan has suspended 25 members of the Congress for five days for causing "grave disorder" in Parliament.

ఒకరిద్దరు కాదు.. ఒకేసారి 25 మంది ‘ఔట్’

Posted: 08/03/2015 06:59 PM IST
Speaker suspended 25 congress mp from parliament sessions

పార్లమెంటు సమావేశాలు మొదలైనరోజు నుంచి కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలతూటాలు పేలుతూ వచ్చాయి. అయితే.. సోమవారం మాత్రం ఈ ఆందోళన పర్వం తారాస్థాయికి చేరిపోయింది. ముఖ్యంగా లలిత్ మోదీ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న విదేశాంగ మంత్రి సుష్మాస్వారాజ్, రాజస్థాన్ సీఎం వసుంధర రాజె, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో సభలో గందరగోళ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో తీవ్ర అసహనానికి గురైన స్పీకర్ సుమిత్రా మహాజన్.. ఆందోళనలు చేస్తున్న ఎంపీల పేర్లు చదివి మరీ వారిని సభ సజావుగా సాగించేందుకు సహకరించాలని సూచించారు. అయినప్పటికీ వారు తమ తీరును మార్చుకోకుండా ఆందోళన చేయడమే కాక.. సస్పెండ్ చేస్తామని బెదిరించడం సరికాదని పలువురు విపక్ష నేతలు స్పీకర్ కే సూచించారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో 25 మంది కాంగ్రెస్ ఎంపీలను 5 రోజులపాటు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అలా వారిని సస్పెండ్ వెనువెంటనే సభను వాయిదా వేస్తున్నట్లు స్పష్టం చేశారు. మరోవైపు.. ఎంపీలను ఇలా సస్పెండ్ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sonia gandhi  parliament of india  lok sabha sessions  

Other Articles