Pawan Kalyan | Pawan kalyan tweets | Janasena | pawan on ap mps | pawan Kalyan on ap reorganisation bill

Janasena party president pawan kalyan question to ap mps

Pawan Kalyan, Pawan kalyan tweets, Janasena, pawan on ap mps, pawan Kalyan on ap reorganisation bill, Pawan Kalyan qestions mps, Pawan kalyan updates

Janasena party president pawan Kalyan question to ap mps. He questioned that "In that Debate only Five MPs participated according to my Info.What happened to rest of the MPs?

అప్పుడు ఎక్కడికెళ్లారు అని ప్రశ్నించిన పవన్.. మరోసారి ఏపీ ఎంపీలను నిలదీశారు

Posted: 07/09/2015 11:47 AM IST
Janasena party president pawan kalyan question to ap mps

మరోసారి పవన్ ప్రశ్నల వర్షం కురిపించారు. జనసేన పార్టీ అధినేతగా అధికారం కోసం కాదు ప్రశ్నించడానికి అంటూ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ తాజాగా మరోసారి ఏపి ఎంపీల మీద ప్రశ్నల వర్షం కురిపించారు. అయితే కొంత మంది ఏంపీలు వ్యాపారం చేస్తున్నారు తప్పితే ఏపికి ప్రత్యేక హోదా కోసం ప్రయత్నాలు చెయ్యడం లేదని ట్వీట్ చెయ్యడంపై కొంత మంది ఎంపీలు రకరకాలుగా మాట్లాడారు. అయితే ఏపి రాష్ట్రానికి సంబందించిన విభజన బిల్లు పెట్టిన సమయంలో ఏపి ఎంపీల వైఖరిపై ప్రశ్నించారు. మార్చ్ 17, 2015 నాడు ఏపి రి-ఆర్గనైజూషన్ అమిండమెంట్ బిల్ పై లోక్ సభలో డిస్కషన్ హవర్ లో చర్చించే సమయంలో ఎంత మంది ఎంపీలు ఉన్నారని ప్రశ్నించారు. కేవలం ఐదు మంది మాత్రమే అక్కడ ఉన్నారని, మిగిలిన వారు ఎక్కడ అని ప్రశ్నించారు.

pawankalyan-tweets-about-mp

నిజానికి సీమాంధ్ర ఎంపీలు విభజన బిల్లు మీద అటు లోకసభలో, రాజ్యసభలో నానాయాగీ చేశారు. కానీ కేవలం మీడియా కవరేజ్ కోసం పాకులాడారు కానీ ఏపి పరిస్థితి ఏమవుతుంది అన్న కోణంలో ఆలోచించలేదు. అలాగనక ఆలోచించి ఉంటు మాత్రం ఏపి పునర్విభజన బిల్లు మీద చర్చించడానికి ఎందుకు హాజరు కాలేదు అన్నది ప్ర్రశ్న. నిజానికి విభజన సమయంలో ఉన్న లోపాల మీద ఎత్తిచూపేలా కేంద్రాన్ని నిలదీయడమో చెయ్యకుండా పార్లమెంట్ బయట ప్లకార్డ్ లతో నినాదాలు చేస్తే వచ్చిందేమీ లేదన్నది నిజం. కానీ జనాలకు మాత్రం ఈ కోణం అర్థం కాదు ఎందుకంటే మీడియా కూడా ఇలాంటి మంచి విషయాల మీద దృష్టి సారించదు. కానీ సెన్షేషన్ కోసం పాకులాడే మీడియా ఈ దిశగా ఫోకస్ చేసి ఉంటే ఏపి కాస్త మేలు జరిగి ఉండేది.

Also Read:  పవన్ కళ్యాణ్ చెప్పేదాకా.. తెలియదా..?

తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ల ఫలితంగా అయినా మన ఎంపీలు ఎంత బాధ్యతగా పని చేస్తున్నారో..? ప్రజాప్రతినిధుల పేరుతో రాజభోగాలు అనుభవిస్తున్న ఎంపీలు ఏపి బాగోగులు కోసం ఎంతలా కృషి చేశారో అర్థమవుతోంది. అయితే ఐదంటే ఐదు మంది కూడా చర్చలో పాల్గొనకపోవడం ఏపి ఎంపీ చిత్తశుద్దిలేమికి నిదర్శనం. నిజానికి ఎంపీలు హౌస్ లో ఉండి నిలిదీయాలి..? కేంద్రానికి ఏపి మనుగడపై ప్రశ్నలు అడగాలి..? ప్రజలకు అర్థమయ్యేలా ఏపికి జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించాలి..? కానీ అవేవీ పట్టనట్లు పట్టుమని ఐదు మంది కూడా లేకుండా.. హౌజ్ లో గొంతెత్తాల్సిన ప్రజాప్రతినిధలు మీడియా ముందు చిల్లర వేషాలు వేకయడం నిజంగా సిగ్గుచేటు. కానీ ఇలాంటి వాస్తవాలు పవన్ కళ్యాణ్ లాంటి సరైన వ్యక్తి ప్రశ్నించినప్పుడు నిజంగా ప్రజలు ఆలొచిస్తారు. మరి పవన్ కళ్యాణ్ మీద అంతెత్తుకు లేచిన ఎంపీలు మరి తాజా ప్రశ్నకు ఎలా సమాధానమిస్తారో..? ఏమని సమాధానమిస్తారో చూడాలి.

పార్లమెంట్ పాస్ చేసిన ఏపి పునర్విభజన చట్టం ఒరిజినల్ కాపీ కోసం క్లిక్ చేయండి

By Abhinavachary

Also Read:  మీ పౌరుషం ప్రత్యేకహదా తేవడంపై చూపండి.. నాపై కాదు: పవన్
Also Read:  పవన్ ను ప్రశ్నించే వాళ్లు ముందు వీటికి జవాబు చెప్పండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles