Pawan Kalyan | Janasena | pawan Kalyan updates | Pawan Kalyan news |

Pawan kalyan questions rise new thoughts in telugu people

Pawan Kalyan, Janasena, pawan Kalyan updates, Pawan Kalyan news, janasena party, Telugu states, Pawan on section 8, Pawankalyan andhra mps

Pawan Kalyan questions rise new thoughts in telugu people Actor and Jana Sena Party chief Pawan Kalyan on Monday advised governments of both Andhra Pradesh and Telangana to exercise restraint and focus on development of their respective states.

పవన్ కళ్యాణ్ చెప్పేదాకా.. తెలియదా..?

Posted: 07/07/2015 12:31 PM IST
Pawan kalyan questions rise new thoughts in telugu people

జనసేన పార్టీ అధ్యక్షుడు, తెలుగు సినిమా రంగంలో తిరుగులేని స్టార్ డంను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తాజాగా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై మాట్లాడారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల విభేదాల వల్ల తెలుగు ప్రజలకే నష్టం అని అన్నారు. పవర్ కోసం కాదు ప్రశ్నించడానికి అనే నినాదంతో జనం ముందు వచ్చారు పవన్ కళ్యాణ్. అయితే గత ఎన్నికల సమయంలో టిడిపి, బిజెపి పార్టీ ఉమ్మడి కూటమికి మద్దతుగా ప్రచారం చేసినా కానీ పూర్తి స్థాయిలో రాజకీయ నేతగా వ్యవహరించలేదు. అయితే తెలుగు రాష్ట్రాల మధ్య గత కొంత కాలంగా తలెత్తుతున్న వివాదాలపై త్వరలోనే స్పందిస్తానని చెప్పిన పవన్ కళ్యాణ్ నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు తెలుగు ప్రజల్లో కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.

పవన్ మాటలు - నిజాలు:
* హైదరాబాద్ లో సెక్షన్ 8 అమలు అవసరం లేదు - పవన్ కళ్యాణ్ చెప్పినట్లు సీమాంధ్రుల రక్షణకు ఏమైనా భంగం కలిగింది అని అనిపిస్తే అప్పుడు సెక్షన్ 8 అవసరం కానీ ఇప్పుడు అవసరం లేదు. నిజానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత హైదరాబాద్ లో ఎలాంటి అల్లర్లు కానీ అలజడులు కానీ చోటుచేసుకోలేదు. సీమాంధ్రులు తమ ప్రాణాలకు, ఆస్తులకు నష్టం కలుగుతుంది అని ఎక్కడా కనీసం ఫిర్యాదు చెయ్యడమో లేదా మీడియా ముందు చెప్పడమో చెయ్యలేదు. ప్రస్తుతం హైదరాబాద్ లో ఎవరికి ఎలాంటి నష్టం లేదా అన్యాయం జరగనప్పుడు సెక్షన్ 8 అవసరం లేదు. సెక్షన్ 8 కేవలం సీమాంధ్రుల రక్షణ కోసం ఉద్దేశించినదే తప్ప ఇంకేం లేదు.

Also Read: తిడితే కేసీఆర్ లా తిట్టాలి.. పడితే పౌరుషం లేని సీమాంధ్ర ఎంపీలా పడాలి

*సెక్షన్ 8 అమలు చెయ్యాలని కేంద్రాన్ని ఆశ్రయిస్తే రెండు రాష్ట్రాలకు కూడా నష్టమే -  కేంద్రం మరోసారితెలుగు రాష్ట్రాలను విడగొట్టేటప్పుడు కేంద్ర ప్రభుత్వం తప్పులు చేసింది. అది అందరికి తెలుసు. యుపిఎ ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్లే తెలుగు రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. అందుకే సెక్షన్ 8 అమలును కోరుతూ మరోసారి తెలుగు రాష్ట్రాలు గనుక కేంద్రాన్ని ఆశ్రయిస్తే గతంలో చేసిన తప్పే మళ్లీ జరుగుతుంది. అప్పుడు రెండు రాష్ట్రాలకు నష్టం. అయితే యుపిఎ ప్రభుత్వం నిర్వాకం వల్ల తెలంగాణకు మేలు జరిగినా కానీ ఏపికి మాత్రం అన్యాయమే జరిగింది. అయితే తాజాగా సెక్షన్ 8ను అమలు చెయ్యాలని కోరుతూ కేంద్రం వల్ల కు వెళితే మాత్రం తెలంగాణకు కూడా అన్యాయం జరుగతుందన్నది వాస్తవం.

Also Read:  హైదరాబాద్ లో సెక్షన్ 8 కు నేను వ్యతిరేకం: పవన్ కల్యాన్

* ఏపి మంత్రులు ఏపి గురించి పెద్దగా పోరడటం లేదు, వ్యాపారాలను చూసుకుంటున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించడం లేదు. - తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చెయ్యాలని తెలంగాణ నేతలు ఎంతో తెగువ చూపించారు. కాదు అన్న కేంద్రం దగ్గర మొండికేసి, అవును అనిపించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు  చేసేలా చేశారు. అయితే తెలంగాణ బిల్లు సమయంలో చేసిన పోరాటం ఏపి మంత్రుల్లో తర్వాత కనిపించలేదు. నిజానికి తెలంగాణ ఏర్పాటు తర్వాత ఏర్పాటును వ్యతిరేకించారే తప్ప.. ఏపికి ఏం చేస్తే మేలు కలుగుతుందో ఎవ్వరూ కూడా సూచించలేదు.

Also Read:  తెలుగు జాతీ ఐక్యతకు తొలి అడుగువేసింది కేసీఆర్: పవన్ కల్యాన్

* తిడితే కేసీఆర్ లా తిట్టాలి, పడితే ఏపి ఎంపీల్లా పడాలి -  ఇక తెలంగాణ ముఖ్యమంత్రి మాట తీరు గురించి పవన్ ప్రస్తావించిన తీరు విలేకరులను నవ్వించింది. తిడితే కేసీఆర్ లా తిట్టాలి అనగానే అందరు నవ్వారు. అయితే అలా అంటూనే ఉద్యమ సమయంలో ఎలా మాట్లాడినా పర్వాలేదు కానీ ఓ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన తర్వాత మాత్రం గతంలోలాగ ఉంటే కుదరదు అని అన్నారు.

Also Read:  సీమాంధ్రులను ఆంద్రవాళ్లు, సెట్లర్స్ అనోద్దు: పవన్ కల్యాన్

* ఆంధ్రావాళ్లు, సెటిలర్లు అనే మాటలు వాడొద్దు - ఇక నిన్నటి దాకా కలిసే ఉన్న తెలంగాణ, సీమాంధ్రుల మధ్య అప్పుడే ప్రాంతీయ విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. అందుకే మామూలు వ్యక్తులు అంటే పర్వాలేదు కానీ బాధ్యత గల పదవుల్లో ఉంటూ ఆంధ్రవాళ్లు, సెటిలర్లు, సీమాంధ్రులు అని అనొద్దు అని, ఆంధ్రా అనే పదం తెలుగుదేశం పార్టీకో లేదా చంద్రబాబు నాయుడుకో సంబందించినది కాదు అని అన్నారు.

Also Read:  ప్రతీకారం తీర్చుకునేందుకు రాజకీయాలైతే.. ప్రజలే నష్టపోతారు..

* మీడియాకు నా మీద విమర్శలు చేసే స్వేచ్ఛ కూడా ఉంది - ఇక గత కొంత కాలంగా కొన్ని చానళ్స్, పత్రికల మీద విధించిన నిషేదం మీద కూడా పవన్ మాట్లాడారు. మీడియాకు ఎవరి మీదనైనా విమర్శలు చేసేందుకు హక్కుందని అంటూనే చంద్రబాబు నాయుడతో పాటు, నా మీద కూడా విమర్శలు చేయవచ్చు అని పవన్ అన్నారు. నిజానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణకు వ్యతిరేకంగా కథనాలు ప్రసారం చేసినందుకు, ప్రచరితం చేసినందుకు అంటూ కొన్ని చానల్స్ పై నిషేదం విధించారు. అలాగే చంద్రబాబు నాయుడు కూడా ఓటుకు నోటు వ్యవహారంలో దుమారం రేగిప్పుడు కూడా ఏపిలొ కొన్ని చానల్స్ పై కొంత కాలం నిషేదం విధించారు. అయితే బారత్ లాంటి ప్రజాస్వామ్య దేశాల్లో మీడియా గొంతు నొక్కడం ఎంత మాత్రం సబబు కాదు అందుకే పవన్ కళ్యాణ్ మీడియా స్వేచ్ఛ మీద మాట్లాడారు.

Also Read:  పవన్ కళ్యాణ్ ప్లాన్ అదేనా..?

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles