MP kesineni nani counters jena sena comments

Kesineni nani contrversial remarks on pavan kalyan

kesineni nani contrversial remarks on pavan kalyan, MP kesineni nani counters jena sena comments, anxiety over pavan kalyan press meet, pavan kalyan on cash for vote case, cash on vote, phone tapping, media, revanth reddy, cash for vote, cherlapally central jail, bail, cash for vote scam forth accused muthaiah, muthaiah jerusalem, vijayawada police, satyanarayana puram police, andhra pradesh CID, cash for vote, chandra babu, revanth reddy, acb, sandra venkata veeraiah, Kcr, telangana mlc elections, stephen son, TRS nominated mla stephenson, sebestian, muthaiah, horse riding

Vijayawada MP Kesineni Nani reacts to the remarks made by Jana Sena chief Pawan Kalyan.

పవన్ కల్యాన్ ను కేశినేని నాని ఎందుకు విమర్శించారు..?

Posted: 07/07/2015 05:02 PM IST
Kesineni nani contrversial remarks on pavan kalyan

జనసేన అధినేత, సినీ నటుడు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని చేసిన విమర్శలు పార్టీ వర్గాలను విస్మయానికి గురిచేస్తున్నాయి. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల మద్య చోటుచేసుకున్న తాజా రాజకీయ పరిణామాలపై క్రితం రోజు పవన్ కల్యాణ్ తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా వ్యక్తీకరించారు. రాష్ట్ర విభజన వల్ల తెలంగాణకు న్యాయం జరిగిందని, కాగా ఆంద్రప్రదేశ్ కు అన్యాయం జరిగిందని.. ఆ అన్యాయాన్ని కేంద్రం ప్రత్యేక హోదాను కల్పించి న్యాయం చేయాలని పవన్ కల్యాన్ కోరారరు. ఈ ధిశగా సీమాంధ్ర ఎంపీలు పోరాటం చేయడం లేదని, తెలంగాణ ఉద్యమం సాగిన క్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఎంపీలు ప్రత్యేక హోదా కోసం ఉద్యమించాల్సిన అవసరం వుందని ఆయన సూచించారు.

అయితే పవన్ వ్యాఖ్యలపై పలువురు టీడీపీ ఎంపీలు తీవ్రంగానే స్పందించారు. ఎంపీలందరూ తాము రాష్ట్రం కోసం ఎంతగా పని చేస్తున్నది వివరణ ఇచ్చుకున్నట్లు కనిపించారు. అయితే ఒక్క విజయవాడ ఎంపీ కేశినేని మాత్రం కొంత ఘాటుగానే బదులిచ్చారు. పవన్ తన ప్రసంగంలో ‘ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా పోట్లాడారని, పార్లమెంటు గోడలు చూస్తూ నోరెళ్లబెడుతున్నారని’ చేసిన వ్యాఖ్యలు తనను ఉద్దేశించినవేనని నాని భావించడం వల్లే ఆయన ఇంత తీవ్రంగా విమర్శించారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అయితే ఇక్కడ మరో విషయం కూడా వుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అదేంటంటు ఎన్నికల సమయంలో పవన్ కల్యాన్ ను విజయవాడ లో తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో పలు సభలలో ప్రసంగించాలని ఆయన కోరినా.. సమయాభావం వల్ల కొన్ని సభల్లోనే పవన్ పాల్గోన్నారన్న పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే ఎన్నికల సమయంలో తమ నియోజకవర్గాలకు రమ్మని పిలిచిన నేతలు నియోజకవర్గాలకు వెళ్లిన పవన్.. వారి గెలుపుకు బాటలు వేశారు. అటు ప్రధాన మంత్రి మోడీకి ఇచ్చిన మాట కోసం తాను అహర్నిషలు కష్టపడి ఎంపీల విజయం కోసం పాటుపడితే.. వారు ప్రత్యేక హోదా కోసం ఎందుకు పాటుపడరని పవన్ అవేదన వ్యక్తం చేశారని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి.

అయితే. పవన్ కోన్ని సభలలో మాత్రమే పరిమితంగా మాట్లాడినా.. తన గెలుపు నల్లేరు మీద నడకగా మారిందని కాబోలు.. లేక తన వినతిని పట్టించుకోలేదన్న అక్కస్సు ఇంకా మనస్సులో వుండో..? లేక పవన్ సాయం లేకుండానే తాను గెలిచానన్న భావనతోనే.. కేశినేని పవన్ పై విమర్శలు చేసివుండవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఎంపీల విమర్శలతో టీడీపీ, జనసేన పొత్తుకు బీటలు వారుతున్నాయా అని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, బుధవారం చంద్రబాబు జపాన్ పర్యటన నుంచి వచ్చాక నానీని వివరణ కోరుతారని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : pavan kalyan  jenasena  kesineni nani  TDP  

Other Articles