Sandra Venkataveeriah | ACB | Telangana | Cash for vote, revanth Reddy, Call data

Court sentenced two weeks custody to sandra venkata veriah in the vash for vote case

Sandra Venkataveeriah, ACB, Telangana, Cash for vote, revanth Reddy, Call data

Court sentenced two weeks custody to Sandra Venkata veriah in the vash for vote case. ACB add Sandra Venkataveeriah as A5 in the cash for vote case.

సండ్రకు 14 రోజుల రిమాండ్.. రేపు బెయిల్ పిటిషన్ పై విచారణ

Posted: 07/07/2015 03:03 PM IST
Court sentenced two weeks custody to sandra venkata veriah in the vash for vote case

ఓటుకు నోటు కూసులో కీలకంగా భావిస్తున్న ఖమ్మం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే పండ్ర వెంకటవీరయ్య ను ఏసీబీ అధికారులు కోర్టు ముందు హాజరుపర్చారు. అయితే ఓటుకు నోటు కేసులో సండ్రను ఐదో నిందితుడిగా చేర్చారు. ఏ1గా రేవంత్ రెడ్డి, ఏ2గా సెబాస్టియన్, ఏ3గా ఉదయ్ సింహా, ఏ4గా మత్తయ్యలు గా ఉండగా తాజాగా ఏ5గా సండ్ర వెంకటవీరయ్య పేరును చేర్చింది తెలంగాణ ఏసీబీ. ఓటుకు నోటు కేసులో తెంలగాణ టిడిపి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యను ఏసీబీ అధికారులు అరెస్టు చెయ్యడంపై సత్తుపల్లిలో బంద్ వాతావరణం తెర లేచింది. అయితే సండ్ర మరో ఐదుగురికి ఫోన్ చేసినట్లు, దాదాపు 22 సార్లు ఫోన్ మాట్లాడారని, ఓటుకు నోటు  కేసులో ముందు మాట్లాడింది సండ్ర వెంకటవీరయ్యేనని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. అయితే సండ్ర కాల్ డేటా ఆధారంగా ఓటుకు నోటు వ్యవహానంలో సండ్ర పాత్రపై క్లారిటీ ఉందని ఏసీబీ వాదించింది.

అయితే  విచారణకు హాజరైన సండ్ర కనీసం ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదని, కాబట్టి ఐదు రోజులు తమ కస్టడీకి అప్పగించాలని ఏసీబీ కోర్టును కోరింది. అయితే ప్రస్తుత ప్రాథమిక సాక్షాధారాల ప్రకారం ఓటుకు నోటు వ్యవహారంలో సండ్ర పాత్ర ఉందని కోర్టు నమ్ముతూ రెండు వారాల కస్టడీ విధిస్తు కోర్టు తీర్పునిచ్చింది. అయితే సండ్ర బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని సండ్ర తరఫు లాయరుకు సలహా కూడా ఇచ్చింది. అయితే వెంటనే బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు సండ్ర తరఫు లాయరు. అయితే రేపు ఈ పిటిషన్ విచారణకు రానుంది. ఏసీబీ అధికారులు తనపై తప్పుడు కేసులు బనాయించారని సండ్ర ఆరోపించారు. విచారణలో భాగంగా తనకు తెలిసిన అన్ని వివరాలను ఏసీబీ అధికారులకు వివరించానని సండ్ర వెల్లడించారు. కేవలం ఫోన్ డాటా ఆధారంగా కేసులు ఎలా నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. ఏసీబీ అధికారులు తనపై నమోదు చేసిన తప్పుడు కేసుపై కోర్టులో న్యాయపోరాటం చేస్తానని సండ్ర ప్రకటించారు. అయితే సండ్ర అరెస్టు వార్త వినగానే సండ్ర కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు.

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sandra Venkataveeriah  ACB  Telangana  Cash for vote  revanth Reddy  Call data  

Other Articles