Sandra | Tdp | note for vote case | chandrababu | Phone Taping

Tdp mla sandra venkata veriaah went for telangana acb investigation

sandra, Tdp, note for vote case, chandrababu, Phone Taping

TDP Mla Sandra Venkata Veriaah went for Telangana ACB investigation. Telanagana ACB already issued notices twice to sandra on cash for vote investigation.

ఏసీబీ ముందుకు సండ్ర.. ఏం జరగబోతోందన్న ఉత్కంఠ

Posted: 07/06/2015 10:51 AM IST
Tdp mla sandra venkata veriaah went for telangana acb investigation

ఓటుకు నోటు కేసులో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య తెలంగాణ ఏసీబీ ఎదుట హాజరయ్యారు. ఇప్పటికే రెండుసార్లు తెలంగాణ ఏసీబీ నుండి నోటీసులు అందుకున్న సండ్ర ఏసీబీ ఎదుట హాజరవడంతో ఉత్కంటతకు తెర లేచింది. గతంలో అనారోగ్య కారణాల వల్ల ఏసీబీ విచారణకు హాజరుకాలేకపోయిన సండ్ర తాజాగా మరోసారి ఏసీబీ నోటీసులు అందించడంతో రాకతప్పలేదు. అయితే సండ్రకు అందించిన నోటీసులలో సిఆర్పిసి సెక్షన్ 41ఎ ఉండటంతో సండ్ర విచారణ తర్వాత బయటకు వస్తారా లేదా రేవంత్ రెడ్డి లాగా జైలుపాలవుతారా..? అని ప్రశ్నలు  వినిపిస్తున్నాయి. మరి ఏసీబీ విచారణ తర్వాత ఇంటికి వెళతారా లేదా కస్టడీకి వెళతారా అని మరికొద్ది సేపట్లో తేలుతుంది.

Also Read:  సండ్రకు ఆంధ్రాలో ట్రెయినింగ్..?

ఓటుకు నోటు కేసులో టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఏసీబీ ముందు హాజరు కావడటంతో... రాజకీయవర్గాల్లో ఇదే చర్చ. ఇంతకీ ఏసీబీ సండ్రను ఏం ప్రశ్నించబోతోంది? ఆయన్ను అరెస్ట్‌ చేసే అవకాశాలున్నాయా? టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు ఓటుకు నోటుకు వ్యవహారంతో సంబంధం ఉందనేది ఏసీబీ అనుమానం. విషయం తేల్చుకునేందుకు టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి అరెస్టు తర్వాత... టీడీపీ నేత వేం నరేందర్ రెడ్డితోపాటు సండ్రకు కూడా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్... సెక్షన్ 160 కింద నోటీస్ జారీ చేసింది ఏసీబీ. అనారోగ్యం వల్ల తాను విచారణకు రాలేకపోతున్నానని ఏసీబీకి లేఖ పంపారు సండ్ర. ఐతే... రేవంత్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేశాక, ఏసీబీకి సండ్ర మరో లేఖ పంపారు.

Also read: ఏసీబీ రమ్మంటే అనారోగ్యం అంటున్న సండ్ర

తన ఆరోగ్యం కుదుట పడిందని, ఎప్పుడు విచారణకు పిలిచినా హాజరవుతానని అందులో తెలిపారు. దాంతో CRPC సెక్షన్ 41A కింద నిన్న నోటీసులు పంపింది ఏసీబీ. సోమవారం సాయంత్రం 5గంటల్లోపు విచారణకు రావాలని కోరింది. నిన్ననే సండ్ర ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు.... ఆయన లేకపోవడంతో ఇంటి తలుపుకి నోటీసులు అంటించి వెళ్లిపోయారు. ఏ కేసులోనైనా సంబంధం ఉన్న వ్యక్తికి మాత్రమే 41A సెక్షన్ కింద నోటీసులు పంపుతారు. విచారణ సమయంలో అడిగిన ప్రశ్నలకు అవతలి వ్యక్తి చెప్పిన సమాధానంతో సంతృప్తి చెందకపోతే అరెస్టు చేస్తారు. ఏడేళ్లలోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టు తర్వాత వెంటనే బెయిల్ ఇస్తారు. నిందితుడు సాక్షాల్ని తారుమారు చేస్తాడనీ, సాక్షుల్ని బెదిరిస్తాడనీ అనుమానం ఉంటే మాత్రం అరెస్టు చేసి కోర్టుకు తీసుకెళ్తారు. ఓటుకు నోటు కేసులో స్టీఫెన్‌సన్‌ను మొదట కలిసింది సండ్రేనని ఏసీబీ అనుమానిస్తోంది. సెబాస్టియన్, ఆయన మిత్రుడు బాబ్జీతో కలిసి సండ్ర.... స్టీఫెన్‌సన్‌ను సంప్రదించారని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డికి అనుకూలంగా ఓటు వేసేందుకు సండ్ర రెండు కోట్ల రూపాయలు ఇవ్వజూపినట్లు ఏసీబీ భావిస్తోంది.

Also read:  అర్దరాత్రి ఏసీబీ హల్ చల్.. స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్

By Abhinavachary

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sandra  Tdp  note for vote case  chandrababu  Phone Taping  

Other Articles