Telangana, ACB, Ride, Ap, Sandra venkata veerayya, Vem Narender reddy

Telangana state govt moving fast on cash for vote case

Telangana, ACB, Ride, Ap, Sandra venkata veerayya, Vem Narender reddy

Telangana state govt moving fast on cash for vote case. Telangana state ACB officers went to TDP MLA Sandra venkata veerayya and MLC candidate Vem Narender reddy.

అర్దరాత్రి ఏసీబీ హల్ చల్.. స్పీడ్ పెంచిన తెలంగాణ సర్కార్

Posted: 06/17/2015 08:01 AM IST
Telangana state govt moving fast on cash for vote case

రానున్న 24 గంటల్లో సంచలనాలు అంటూ ఏపి ప్రభుత్వం తరఫున హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో తెలంగాణ సర్కార్ రింగులోకి దిగింది. మాటల్లో కాకుండా చేతల్లో అన్నట్లు రాత్రి పూట తెలంగాణ ఏసీబీ అధికారులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి వేం నరేందర్‌ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యపై దృష్టిసారించారు. ముందుగా సండ్ర వెంకట వీరయ్య ఇంటికి వెళ్లిన ఏసీబీ అధికారులు అక్కడ ఆయన లేకపోవడంతో వెనుదిరిగారు. అయితే అక్కడి నుండి వేం నరేందర్ రెడ్డి ఇంటికి చేరుకున్న అధికారులు అక్కడ ఆయనతో కాసేపు మాట్లాడారు. అయితే గంట పాటు తమతో పాటు రావాలని కోరారని, అయితే తనకు అనారోగ్య సమస్యలు ఉన్నందున రాలేనని వేం నరేందర్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ ఉదయం ఏసీబీ అధికారులు కోరినట్లు హాజరవుతానని చెప్పారు.

కేసుకు సంబంధించి కొంత సమాచారం కావాలని, గంటపాటు తమతో రావాలని ఏసీబీ అధికారులు కోరారు. అయితే... నా ఆరోగ్య పరిస్థితి రీత్యా, అర్ధరాత్రి సమయంలో వారితో రాలేనని చెప్పాను. బుధవారం ఉదయం ఎప్పుడైనా విచారణకు వస్తానని, సహకరిస్తానని స్పష్టం చేశాను. నోటీసులు ఏవైనా ఉన్నాయా అని కూడా అడిగాను. అలాంటివేవీ లేవని అధికారులు చెప్పారని వేం నరేందర్‌ రెడ్డి తెలిపారు. మరోవైపు... సండ్ర వెంకట వీరయ్యకు కూడా ఏ క్షణంలోనైనా నోటీసులు జారీ చెయ్యవచ్చునని ఏసీబీ వర్గాలు తెలిపాయి. ముడుపుల కేసులో రెండో నిందితుడైన సెబాస్టియన్‌ ఫోన్‌ నుంచి సండ్ర వీరయ్యకు కాల్స్‌ వెళ్లినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో లబ్ధి చేకూరేది ఎమ్మెల్సీ అభ్యర్థి అయిన వేం నరేందర్‌ రెడ్డికే కాబట్టి... ఆయనను కూడా ప్రశ్నించాలని ఓ నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో... ఇద్దరికీ నోటీసులు జారీ చేసే దిశగా అడుగు వేయడం గమనార్హం. వీరితోపాటు ముడుపుల కేసుతో సంబంధమున్న వారందరికీ నోటీసులు ఇచ్చి తీరుతామని ఏసీబీ వర్గాలు చెబుతున్నాయి. అయితే... తనకు ఏసీబీ నుంచి ఎటువంటి నోటీసులు అందలేదని సండ్ర వెంకట వీరయ్య తెలిపారు. ఒకవేళ అందితే సమాధానం ఇస్తానని చెప్పారు. మొత్తానికి తెలంగాణ సర్కార్ ఏపి సర్కార్ హెచ్చరికతో స్పీడ్ పెంచింది. కేసుతో సంబందం ఉంది అనుకుంటున్న అందరికి నోటీసులు జారీ చెయ్యడానికి అన్ని ఏర్పాట్లు చేసింది తెలంగాణ ఏసీబీ.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  ACB  Ride  Ap  Sandra venkata veerayya  Vem Narender reddy  

Other Articles