Revanth Reddy, cash for Vote, note for vote, bail, Released, TTDP, TDP

Revanth reddy released from the jail just now

Revanth Reddy, cash for Vote, note for vote, bail, Released, TTDP, TDP

Revanth Reddy released from the jail just now. Telangana TDP leader, MLA Revanth Reddy got bail yester day and he released from Jail today.

జైలు నుండి విదులైన రేవంత్ రెడ్డి

Posted: 07/01/2015 05:33 PM IST
Revanth reddy released from the jail just now

ఓటుకు నోటు కేసులో ఏ1 ముద్దాగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదలయ్యారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటుకు వ్యవహారం నడిపి.. స్టీఫెన్ సన్ కు యాభై లక్ష్ల రూపాయలు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే అప్పటి నుండి కస్టడీలో ఉన్న రేవంత్ రెడ్డి కేవలం కూతురి నిశ్చితార్తం రోజు మాత్రం పన్నెండు గంట బెయిల్ మీద విడుదలయ్యారు. కూతురి నిశ్చితార్థ కార్యక్రమం పూర్తికాగానే మళ్లీ జైలు ముఖం పట్టారు. అయితే తాను కేసు విచారణలో అన్ని విధాలుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. గతంలో రెండు సార్లు బెయిల్ పిటిషన్ వేసినా కానీ మూడవసారికి బెయిల్ మంజూరు చేసింది హైకోర్టు.

అయితే రేవంత్ రెడ్డి బెయిల్ విషయం తెలియడంతో తెలుగుదేశం పార్టీ అభిమానులు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం కనిపించింది. ఇక హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి కటౌట్లు ఆకర్షణగా నిలిచాయి. పెద్ద ఎత్తున పంబరాలు చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, రేవంత్ రెడ్డి అభిమానులు తమ నేతకు స్వాగతం పలికారు. అయితే బెయిల్ వచ్చినా కానీ రేవంత్ రెడ్డి తన సొంత నియోజక వర్గమైన కొడంగల్, హైదరాబాద్ లలో తప్ప ఎక్కడా తిరగడానికి వీలులేదని కూడా కొర్టు తీర్పును వెల్లడించింది. అయితే రేవంత్ రెడ్డి బెయిల్ మీద విడుదల తర్వాత ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి..? కేసులో ఎలాంటి మలుపులు తిరుగుతాయి..? అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Revanth Reddy  cash for Vote  note for vote  bail  Released  TTDP  TDP  

Other Articles