greece | IMF | Greece Debt Crisis | Greece Defaults

World economy hit as greece crisis

greece, IMF, Greece Debt Crisis, Greece Defaults

world economy hit as Greece crisis. European markets were slammed Monday, with both the German DAX and French CAC falling more than 3.5%. Portugal's stock market was down about 5%, while Britain's FTSE fared better, shedding only 2%. European bank stocks were particularly hard hit. Spain's Banco Santander dropped 6.7%, while French bank Credit Agricole lost 5%.

గ్రీస్ సంక్షోభం దెబ్బకు ప్రపంచం అబ్బా..

Posted: 07/01/2015 04:04 PM IST
World economy hit as greece crisis

అప్పు చేసి తప్పు చెయ్యకురా.. అని పెద్దలు ఎప్పుడూ చెబుతూ ఉంటారు కానీ గ్రీస్ మాత్రం అది తనకు పట్టదు అన్నట్లు వ్యవహరించిది చివరకు కష్టాల ఊబిలొ చిక్కుకుంది. ప్రపంచ దేశాలు అనుమానించినట్టే గ్రీస్ నిర్ణయం తీసుకుంది.  జూన్‌ 30లోగా లో IMFకు చెల్లించాల్సిన 11వేల 500 కోట్ల రూపాయల వాయిదాను తీర్చలేమని గ్రీస్‌ ప్రకటించింది. దీంతో గ్రీస్‌ను ఆర్థిక సంక్షోభం నుంచి బైటపడేయడానికి అన్ని దారులు మూసుకు పోయినట్టే కనిపిస్తున్నాయి.  ప్రస్తుత బెయిల్‌ అవుట్‌ను పొడిగించడానికి గల అవకాశాలను ఆ దేశమే వదులుకుందని యూరో దేశాల ప్రతినిధులు తెలిపారు. తీసుకున్న రుణంలో ఓ వాయిదా  చెల్లించడానికి  నిన్నటితో గడువు తీరిపోవడంతో... ఇక గ్రీస్... యూరోజోన్ నుంచి తప్పు కోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే పరిస్థితి. ఇది యూరప్ దేశాలతోపాటు ప్రపంచ మార్కెట్లపై ప్రభావం చూపనుంది.

ప్రస్తుతానికి మార్కెట్లు ఊహించిన స్థాయిలో  పతనం కాకపోయినప్పటికీ  తర్వాతి పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన మదుపరుల్లో మొదలయింది. కొత్త ఒప్పందం కుదిరేలోపు గ్రీస్‌ తన వైఖరి మార్చుకుంటే మంచిదని యూరోగ్రూప్‌లోని దేశాలు అంటున్నాయి. గ్రీస్‌ ప్రభుత్వ రాజకీయ వైఖరి ఇంకా మారినట్టు కనిపించడంలేదని తెలిపారు. గ్రీస్ మాత్రం తమ దేశం చేసే ఎలాంటి ప్రతిపాదన అయినా ప్రజాభిప్రాయం తర్వాతేనని అంటోంది. ఇవాళ కౌన్సిల్ మళ్లీ  సమావేశమయి అందులో గ్రీస్‌ సమర్పించే కొత్త ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. గ్రీస్ ప్రభుత్వ నిర్ణయంతో గ్రీస్ ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే అక్కడ బ్యాంకులు మూతపడ్డాయి. ATMలు ఖాళీ అయ్యాయి. నిరుద్యోగం పెరిగింది. ప్రభుత్వ పెన్షన్లు రావట్లేదు. అయితే గ్రీస్ సంక్షోభం ప్రభావం ప్రపంచం మొత్తం పడబోతోంది. ఈయులో ఎంతో కీలకదేశంగా ఉటున్న గ్రీస్ ఆర్థిక సంక్షోభంపై అన్ని దేశాలు భయపడుతున్నాయి. తమ ఆర్థిక వ్యవస్థ ఎలా చిన్నాభిన్నం అవుతుందో అని అన్ని దేశాల ఆర్థికవేత్తలు చర్చించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : greece  IMF  Greece Debt Crisis  Greece Defaults  

Other Articles