A Lady Industrialist named Amulya Reddy caught in drunk n drive in hyderabad | Drunken lady anger on media

Lady industrialist caught in drunk n drive in hyderabad and anger on media

amulya reddy, lady industrialist, drunk and drive, amulya reddy drunk and drive, lady industrialist amulya reddy, amulya reddy latest news, amulya reddy drunk n drive case, hyderabad city, hyderabad drunk and drives, ladies in drunk n drive case

Lady Industrialist caught in drunk n drive in hyderabad and anger on media : A Lady Industrialist named Amulya Reddy caught in drunk n drive in hyderabad. At that time when media taking her media then she anger on them.

మీడియాపై చిందులేసిన ‘మందు’లేడి ఇండస్ట్రియలిస్ట్

Posted: 06/29/2015 10:05 AM IST
Lady industrialist caught in drunk n drive in hyderabad and anger on media

‘డ్రంక్ అండ్ డ్రైవ్’ను అరికట్టేందుకు ప్రభుత్వం ఎన్నివిధాలుగా ప్రయత్నాలు చేపట్టినప్పటికీ.. జనాల్లో మాత్రం మార్పు రావట్లేదు. వీకెండ్ వస్తే చాలు.. పీకలదాకా మందు తాగేసి నానారాద్ధాంతం చేస్తారు. ఒకప్పుడు పురుషులే ఇలా రాత్రిళ్లు తప్పతాగి హడావుడి చేస్తే.. ఇప్పుడు వారికి ఏమాత్రం తీసుకుపోకుండా మహిళలు సైతం రచ్చరచ్చ చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నగరంలో కొందరు మహిళలు తప్పతాగి పోలీసులకు చుక్కలు చూపించిన వైనాలు ఎన్నో వెలుగులోకొచ్చాయి. ఇప్పుడు కూడా ఈ తరహాలోనే మరో లేడీ ఫుల్లుగా తాగి పోలీసులకు చిక్కిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నెం.12లో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున డ్రంకన్ డ్రైవ్ సోదాలు చేపట్టారు. అదే సమయంలో అమూల్యా రెడ్డి అనే మహిళా పారిశ్రామికవేత్త అటువైపుకు వచ్చింది. పోలీసులు సోదాలు చేస్తున్న వైనాన్ని చూసిన ఆమె.. తన కారును ఆపకుండా వేగంగా దూసుకుపోయింది. దీంతో పోలీసులు ఆమె వాహనాన్ని వెంటాడారు. కొద్దిసేపటివరకు ఈ కార్ల రేస్ పోటీ జరిగిన అనంతరం.. ఎట్టకేలకే ఒక చోట పోలీసులు ఆమె వాహనాన్ని ఆపగలిగారు. ఆ తర్వాత ఆమెకు బ్రీత్ ఎనలైజర్ పరీక్ష నిర్వహించగా మోతాదుకు మించి మద్యం తాగినట్టు నిర్ధారణ అయింది. దాంతో పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసి.. కారును స్వాధీనం చేసుకున్నారు.

ఇంతవరకు బాగానే వుంది కానీ.. పోలీసులు తనను తనిఖీ చేస్తున్నప్పుడు ఆ మొత్తం వైనాన్ని మీడియా వాళ్లు చిత్రీకరిస్తున్నారు. అది చూసిన ఆమె మీడియా మీద చిందులేసింది. తన వీడియోని ఎందుకు చిత్రీకరిస్తున్నారని, అలా చేయొద్దని ఆమె మండిపడింది. కాగా.. ఇటీవల ఓ లేడీ డాక్టర్, ఓ ఫ్యాషన్ డిజైనర్ కూడా డ్రంకన్ డ్రైవ్‌‌‌‌లో పోలీసులకు పట్టుబడిన సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : amulya reddy  lady industrialist  drunk n drive  hyderabad  

Other Articles