Aviation Ministry rejects low-cost airlines' plan to charge for check-in baggage, rules out 'burden' on people

Govt rejects airlines proposal to charge for check in baggage

AirAsia, check in baggage, civil aviation, DGCA, IndiGo, luggage charge, mahesh sharma, spicejet, low-cost airlines, Civil Aviation Ministry, extra burden on passengers, Directorate General of Civil Aviation

In a major relief for people, the Aviation Ministry on Saturday rejected proposal by low-cost airlines to charge for check-in baggage. Minister of State for Civil Aviation Mahesh Sharma confirmed it by saying that they do not put extra burden on passengers.

చౌకధర విమానయాన సంస్థల ఎత్తును చిత్తుచేసిన డిజీసీఏ

Posted: 06/27/2015 10:42 PM IST
Govt rejects airlines proposal to charge for check in baggage

విమాన ప్రయాణికులకు శుభవార్త. విమానయాన ప్రయాణికులు తమ వెంట తీసుకువెళ్లే లగేజీపై చార్జీల మోతను పెంచరాదని ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సూచించింది. చౌకదరల విమానయాన సంస్థలు ప్రయాణికుల ధరలపై పోటీపడుతూ అత్యంత చౌకగా గమ్యస్థానాలకు చేర్చుతూనే.. ఇటు ప్రయాణికుల లగేజీపై చార్జీలను విధించాలని భావించాయి. స్పైస్‌జెట్‌, ఇండిగో, ఎయిర్‌ ఆసియా వంటి చవక ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు చెక్‌ ఇన్‌ లగేజీపై చార్జీలు విధించాలన్న ప్రతిపాదనలు డిజిసిఎ ముందుంచాయి. అయితే ఇప్పటికే విమాన టికె ట్‌ చార్జీల మోతతో ఎంతో మంది విమానయానానికి దూరంగా ఉన్నారని.. ఇలాంటి నేపథ్యంలో ప్రయాణికులపై ఎలాంటి అధిక భారం మోపడం ఇష్టంలేని డిజీసీఏ అందుకు ఎర్రజెండాను ఊపింది.

ఇప్పటిదాకా ప్రయాణికులు తమ వెంట 15 కిలోల వరకు లగేజీని ఎటువంటి చార్జీలు చెల్లించకుండా తీసుకువెళ్లే వెసులుబాటు ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది లగేజీని తీసుకువెళ్లడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే చెకిన్‌ లగేజీపై చార్జీలు వసూలు చేయాలన్న నిర్ణయానికి ఎయిర్‌లైన్స్‌ కంపెనీలు వచ్చాయి. విమాన సర్వీసులను విభజించేందుకు గత ఏప్రిల్‌లోనే డిజిసిఎ దేశీయ ఎయిర్‌లైన్స్‌ కంపెనీలకు అనుమతి ఇచ్చింది. దీని మూలంగా ఎంచుకున్న సీటు, ఆహారం, లాంజ్‌ వినియోగానికి కంపెనీలు వేర్వేరుగా చార్జీలు వసూలు చేయడం మొదలుపెట్టాయి.

చెక్‌ ఇన్‌ లగేజీ ప్రతిపాదనకు ఆమోదముద్రవేస్తే మొదటి చెక్‌ ఇన్‌ లగేజ్‌కి 250 రూపాయలు, రెండో బ్యాగేజీకి 500 రూపాయలు, మూడో బ్యాగేజీకి 1,500 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. మూడు కంపెనీలు ఈ ప్రతిపాదనలు చేశాయి. లగేజీపై చార్జీలను వసూలు చేసే ప్రతిపాదనతో పాటు లగేజీ లేకుండా వచ్చే వారికి డిస్కౌంట్లు ఇస్తామన్న ప్రతిపాదనను కూడా డిజిసిఎ ముందుంచాయి. దీని వల్ల తమ ప్రతిపాదనకు ఆమోదం వస్తుందన్న ఆశతో ఎదురుచూసిన విమాన సంస్థలకు నిరాశే ఎదురైంది. విమానయాన ప్రయాణికులపై అదనపు భారాన్ని ఎంతమాత్రం మోపేందుకు ఇష్టపడని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ మంత్రి మహేష్ శర్మ చెక్ ఇన్ లగేజీ పై చార్జీల విధానాన్ని తాము నిర్ద్వందంగా వ్యతిరేకించినట్లు చెప్పారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AirAsia  check in baggage  civil aviation  DGCA  

Other Articles