vasundhara Raje | BJP | Lalith Modi | Immigration | Cricket | Modi | London

Vasundhara raje on extended london trip when she signed secret document

vasundhara Raje, BJP, Lalith Modi, Immigration, Cricket, Modi, London

Vasundhara Raje on Extended London Trip When She Signed Secret Document Top BJP leader Vasundhara Raje was in London on an extended trip when she signed a secret affidavit supporting the immigration appeal of tainted cricket tycoon Lalit Modi, sources say pointing to new evidence

లలిత్ మోదీ, వసుంధర రాజే ఓ లేఖ

Posted: 06/25/2015 04:28 PM IST
Vasundhara raje on extended london trip when she signed secret document

లలిత్ మోదీ వ్యవహారం బిజెపి అగ్రనాయకత్వానికి తలనొప్పిగా మారింది. రోజురోజుకు మారుతున్న పరిణామాలు నరేంద్ర మోదీ సర్కార్ ను విమర్శల పాలుచేస్తోంది. అయితే లలిత్ మోదీ వ్యవహారంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధర రాజే విమర్శల పాలవుతోంది. తాజాగా లలిత్ మోదీకి వీసా కల్పించడంలో రాజస్థాన్ ముఖ్యమంత్రి స్వయంగా రాసిన లేఖను కాంగ్రెస్ వర్గాలు బయటపెట్టాయి. లలిత్ మోదీకి సహకరిస్తున్న వసుంధర రాజే వెంటనే రాజీనామా చెయ్యాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు. 2011లో క్లైమాట్ ఛేంజ్ మీద జరిగిన సెమినార్ లో బిజెపి పార్టీ నాటి అధ్యక్షుడు నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీతో పాటుగా రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే కూడా పాల్గొన్నారు. లండన్ లో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఆధ్వర్యంలో ఈ సెమినార్ జరిగింది. అయితే అదే సమయంలో లలిత్ మోదీకి అనుకూలంగా ఇమిగ్రేషన్ అధికారులకు లేఖ రాసినట్లు కాంగ్రెస్ నాయకులు సాక్షాధారాలతో సహా వివరిస్తున్నారు.

ఏడు పేజీలు ఉన్న ఈ డాక్యు మెంట్‌లో 21 అంశాలు ఉన్నాయి. లలిత్‌ ఇమ్మిగ్రేషన్‌ దరఖాస్తుకు మద్దతుగా ఈ వాంగ్మూలం ఇస్తున్నట్లు వసుంధర ఆ లేఖలో చెప్పారు. అది కూడా ఈ విషయంలో భారత్‌లోని అధికార వర్గాలకు ఎట్టి పరిస్థితుల్లో తెలియజేయరాదేనే షరతుతో సంతకం చేస్తున్నట్లు వెల్లడించారు. వాణిజ్యపరంగా క్రికెట్‌కు ఉన్న సత్తాను లలిత్‌ గుర్తించినట్లు, దేశవ్యాప్తంగా వచ్చిన క్రికెట్‌ విప్లవం లలిత్‌మోదీ ఘనతే అన్నట్లు వసుంధరా రాజే ఆ పత్రాల్లో ప్రస్తావించారు. లలిత్‌ తనకు చాలా సన్నిహితుడని అందువల్లే ఆయనపై కాంగ్రెస్‌ పార్టీ పగ పెట్టుకుందని ఆమె తెలిపారు’’. తన సంతకం బయట పడిన తర్వాత వసుంధర వైఖరి ఏమిటని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్‌ ప్రశ్నించారు.వసుంధర ముందు ఈ లేఖ తనది కాదన్నారని, తర్వాత గుర్తుకు రావడం లేదని అన్నారని విమర్శించారు. ఇప్పుడు ఆ పత్రాలన్నీ దేశ ప్రజల ముందు ఉన్నాయని, వాటిపై ఆమె సంతకం కూడా ఉందని ఆయన అన్నారు. ఇది ఫోర్జరీ సంతకం కాదని బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాకు చెప్పాలనుకుంటున్నానని జైరాం రమేష్‌ పేర్కొన్నారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : vasundhara Raje  BJP  Lalith Modi  Immigration  Cricket  Modi  London  

Other Articles