MLC, Polling, Voting, Results

Telanagana mlc elections polling end by four oclock

MLC, Polling, Voting, Results

Telanagana MLC elections polling end by four oclock. All parties in telangana fight seriously in this mlc elections.

పోలింగ్ ముగిసింది.. మరికొద్దిసేపట్లో ఫలితాలు

Posted: 06/01/2015 04:38 PM IST
Telanagana mlc elections polling end by four oclock

తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కాక పుట్టించింది. అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా బావిస్తున్న ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. సభలో 119 మంది ఎన్నికైన ఎమ్మెల్యేలు, ఒక నామినేటెడ్ ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 120 మంది ఉండగా.. వారిలో ఇద్దరు వామపక్ష సభ్యులు తమ ఓటుహక్కును వినియోగించుకోలేదు. మిగిలిన 118 మంది మధ్యాహ్నం 3 గంటల లోపే ఓట్లు వేసేశారు. ఇక మిగిలిన రెండు ఓట్లు ఎర్రపార్టీలైన కమ్యునిస్టు పార్టీలకు చెందినా వారు ఎన్నికలకు దూరంగా ఉంటున్నట్లు ప్రకటించేశారు. సాయంత్రం 4 గంటలతో పోలింగ్ సమయం ముగిసింది. టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం తదితర పార్టీల సభ్యులంతా తమ తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. సీపీఎం, సీపీఐ సభ్యులు మాత్రం ఓటింగుకు దూరంగా ఉన్నారు. ప్రస్తుత బలాబలాలను బట్టి చూస్తే.. ఐదుగురు టీఆర్ఎస్ అభ్యర్థులు, ఒక కాంగ్రెస్ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నట్లు నాయకులు చెబుతున్నారు. ఆరు స్థానాలు ఖాళీ ఉండగా, మొత్తం ఏడుగురు అభ్యర్థులు పోటీలో నిలవడంతో ఇక్కడ ఎన్నిక అనివార్యం అయ్యింది.

మొత్తానికి 118 ఓట్లతో ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని పార్టీలు గెలుపు నీదా.. నాదా అన్నట్లు పోటీ పడ్డాయి. అంతకు మించి అన్నట్లు తెలుగుదేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి వ్యవహారం ఎన్నికల వేడి పెంచింది. మరి అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఫలితాలను మరికొద్ది సేపట్లో వెల్లడికానున్నాయి. ఇక టిఆర్ఎస్ పార్టీ మాత్రం సంబరాలకు సన్నాహాలు చేసుకుంటోంది. మరి చూడాలి టిఆర్ఎస్ ఐదో స్థానాన్ని గెలుచుకుంటుందా..? లేదా..? అన్న విషయం మరికొద్దిసేపట్లో తెలుస్తుంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : MLC  Polling  Voting  Results  

Other Articles