ISIS | terrorists | Syria | yazidi | women

A yazidi teenager has told how she and her little sister were raped daily

ISIS, terrorists, syria, yazidi, women , harrase

A Yazidi teenager has told how she and her little sister were raped daily by depraved jihadists after they were sold into slavery at an auction of virgins - as she revealed she is now pregnant with the vile extremist's baby.

అమ్మాయిల చేత ఐఎస్ఐఎస్ రక్త కన్నీరు పెట్టిస్తోంది

Posted: 05/30/2015 04:04 PM IST
A yazidi teenager has told how she and her little sister were raped daily

ఐఎస్ఐఎస్.. ఆ పేరు వింటే చాలా దేశాల్లో వణుకుపుడుతోంది. మనుషులను అతికిరాతకంగా ఏ మాత్రం మానవత్వం లేకుండా కసిగా నరికి చంపే ఉగ్రవాదులను తయారు చేస్తోంది ఐఎస్ఐఎస్. అయితే తాజాగా ఐఎస్ఐఎస్ దారుణాలు ఒక్కొక్కటిగా బయటి ప్రపంచానికి తెలుస్తున్నాయి. పిచ్చో లేదా పైశాచికత్వమో తెలియదు కానీ ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేస్తున్న దారుణాలు వింటుంటేనే రోమాలు నిక్కబొడుచుకునేలా అతి దారుణాలు చేస్తున్నారు. అసలు దారుణాలు అన్న పదం ఏ మాత్రం సరిపోదు అంతకన్నా ఎక్కువ వాళ్లు అరాచకం చేస్తున్నారు. తాజాగా అక్కడ చాలా మంది మహిళలను, అమ్మాయిలను సెక్స్ స్లేవ్స్ గా మారుస్తున్నారు ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు. బానిసలు అంటే అతి నీచంగా చూసే అక్కడి ఉగ్రవాదులు వాళ్లను ట్రీట్ చేస్తున్న తీరు తెలిస్తే.. కళ్ల వెంబడి కన్నీరు కాదు రక్తమే వస్తుంది.

పదహారు సంవత్సరాల ఓ అమ్మాయి చెప్పిన నిజాలు వింటుంటే.. ఐఎస్ఐఎస్ ఉగ్రవాదుల అరాచకాలకు పరాకాష్టగా నిలుస్తోంది. తనను, తన పది సంవత్సరాల చెల్లెల్ని పెట్టిన నరకం.. చేసిన దారుణాలను ఆ అమ్మాయి బయటి ప్రపంచానికి వెల్లడించింది. తన తొమ్మిది నెలల ఐఎస్ఐఎస్ నరకం నుండి బయటికి వచ్చిన అమ్మాయి అక్కడ అమ్మాయిలను ఎలా చూస్తారో.. ఎంత దారుణంగా ట్రీట్ చేస్తారో కంటికి కనిపించేలా చేశాయి. గత ఆగస్టు నెలలో తనను ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారని, తనను, తన చెల్లెల్ని ముందు వర్జినిటి టెస్ట్ చేయించారని తెలిపింది. కన్యత్వం ఉంది అని తేల్చుకున్నాక.. ఓ మార్కెట్ లో ఒంటి మీద కనీసం నూలు పోగు కూడా లేకుండా చేసి అమ్మకానకి పెట్టారు. అలా ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది అమ్మాయిల్ని, మహిళలను అమ్మకానికి ఉంచారు.

మార్కెట్ లో అమ్మాయిలను ఎవరికి నచ్చితే వాళ్లు వేలం పాడి అమ్మాయిలను సొంతం చేసుకోవాలి. అలా అమ్మాయిలను సొంతం చేసుకున్న వారికి అమ్మాయిలు సొంతం. వారి కింద బానిసలుగా ఉండాలి. ఏం చెప్పినా.. ఎంత దారుణానికి తెగబడ్డా ఊరుకోవాలి. కాదు కూడదు అని ఎదురు తిరిగితే ప్రాణాలుండవు. తనతో పాటు తన చెల్లెల్ని కూడా ఓ టెర్రరిస్టు నాయకుడు కొనుకున్నాడని అమ్మాయి తెలిపింది. అయితే రోజు ఉదయాన్నే అమ్మాయిలను బయటకు తీసుకువచ్చి.. అతను అమ్మాయిల వాసన చూస్తాడట. అలా తనకు ఎవరు నచ్చితే వాళ్లు అతనితో ఆ రోజంతా గడపాలి. నచ్చని వాళ్లను అతని కింద పని చేసే బాడీగార్డులు అనుభవిస్తారట. అయితే తాను మాత్రం రోజూ తననే ఎంచుకోవాలని కోరుకునేదట. ఎందుకంటే అతని బాడీగార్డులు మరీ దారుణంగా మానవ మృగాళ్లలా ప్రవర్తిస్తారట. సెక్స్ ఒకేసారి అందరి ముందు చేసే వాళ్లట. సెక్స్  చేసేటప్పుడు తనను బెల్టులతో కొట్టే వారని.. రకరకాలుగా హింసించే వారని అమ్మాయి తెలిపింది.

తనతో పాటు ఉన్న మరో అమ్మాయి సెక్స్ కు ఒప్పుకోలేదని వేడి వేడి నీళ్లను ఒంటి మీద పోశారట. అలా చేసిన తర్వాత అమ్మాయి గాయాలైనా వదలకుండా సెక్స్ లో పాల్గొన్నారట. తన చెల్లెల్ని కూడా చాలా కౄరంగా హింసించారని.. అటు చావాలో లేదా తేల్చుకునే స్థితిలొ లేకుండా చేశారని అంటోంది అమ్మాయి. అసలు నరకం అంటే ఏంటో అక్కడ కంటికి కనిపిస్తోందని అంటోంది. అక్కడి వాళ్లు ఏం చెబితే అది చెయ్యాలి.  వంట వండమని అడిగితే వండాలి.. సాఫ్ సపాయి చెయ్యాలి అంటే చెయ్యాలి అలా కాదు అంటే ఏం చేస్తారో వాళ్లకే తెలియదు. మార్కెట్లో అమ్మాయిలను కొన్న వాళ్లు స్వీట్లు పంచి.. గాల్లోకి కాల్పులు జరిపి డ్యాన్సులు చేస్తారట.

పదహారు సంవత్సరాల యజీదీ అమ్మాయి.. అక్కడ జరిగిన ఓ యుద్దంలో బందీ నుండి విముక్తి చెందింది. తొమ్మిది నెలలపాటు నరకయాతన పడిన ఆ అమ్మాయి ఇప్పుడు బయటి ప్రపంచానికి ఐఎస్ఐఎస్ సంబందించిన నిజాలను చెబుతోంది. తనను, తన చెల్లెల్ని ఎలా హింసించారో తెలిపింది. తొమ్మిది నెలల్లో కొన్ని పదుల రెట్లు తన మీద బలాత్కారం చేశారని, మౌనంగా భరించడం తప్ప చేసేది ఏమీ లేదని కన్నీరు పెట్టుకుంది అమ్మాయి. తనలా కొన్ని వందల మంది అక్కడ నరకం అనుభవిస్తున్నారని బాధపడుతోంది.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ISIS  terrorists  syria  yazidi  women  harrase  

Other Articles