youtube, mime videos, social media

Mime videos goes viral in social media through youtube

youtube, mime videos, social media

Following SketchSHE's "Mime Through Time" video that went viral on social media in the beginning of this month, its desi version "Mime Through Bollywoood" is now doing the rounds in social media. The YouTube video posted by Bengaluru-based The Enthu Cutlets on Tuesday, has already received about seven lakh views and 4000+ likes.

ITEMVIDEOS: ముగ్గురు అమ్మాయిల మైమ్ వీడియో మతిపోగొడుతోంది

Posted: 05/30/2015 03:16 PM IST
Mime videos goes viral in social media through youtube

ఒక కారు.. ముగ్గురమ్మాయిలు.. పాటలు.. బ్లాక్ అండ్ వైట్ హావభావాల నుంచి.. ఈస్ట్‌మన్ కలర్స్ వరకు. హిప్ హాప్ వరకు.. ఆహా నా పెళ్లియంట నుంచి.. సూపర్ మచ్చీ వరకు.. ఆరు నిమిషాల యూట్యూబ్ వీడియో.. లక్షలాది మందిని మైమరించేస్తోంది. తాజాగా మైమ్ పేరుతో విడుదల అవుతున్న వీడియోలు నెట్ ప్రపంచంలో కొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది అన్న నానుడిని మామూలుగా అయితే వినే ఉంటారు. అయితే తాజాగా ముగ్గురు అమ్మాయిలు సరదాగా తీసిన ఓ వీడియో నెట్ లో హల్ చల్ చేస్తోంది. పాత కాలం పాటల దగ్గరి నుండి కొత్త పాపులర్ పాటల వరకు అన్ని పాటలను మిక్స్ చేసి ఎక్సలెంట్ పర్ఫామెన్స్ చేశారు.

ఎడిట్ చేసిన తర్వాత ఇంట్లో వాళ్లకు చూపిస్తే బాగుందనడంతో ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేశారు. ఫేస్‌బుక్‌లో లైకుల మీద లైకులు, హిట్ల మీద హిట్లు రావడంతో యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశారు. మొత్తం నాలుగు నిమిషాల కన్నా ఎక్కువ ఉన్న వీడియోలో అన్ని పాటలకు అద్భుతంగా పర్ఫామెన్స్ తో అదరగొట్టారు అమ్మాయిలు. పాత కాలం ఈన మీన డీకా దగ్గరి నుండి తాజా కొలవరి ఢీ వరకు అన్ని పాటలకు కలిపి చేసిన డ్యాన్స్ అందరికి అలరించింది.  పాటపాటకు గెటప్స్ చేంజ్ చేస్తూ దుమ్మురేపారు. ఎక్కడా ఎనర్జీ తగ్గకుండా స్టెప్పులు వేయడం ఈ వీడియోలో ఇంకో ప్రత్యేకత. ప్రస్తుతం యూ ట్యూబ్‌లో ఇదే క్రేజీ వీడియో.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : youtube  mime videos  social media  

Other Articles