Gandipet, Mahanadu, TDP, farmers, Chandrababu, Telangana

Telangana it minister ktr commented on conducting mahanadu in gandipet

Gandipet, Mahanadu, TDP, farmers, Chandrababu, Telangana

Telangana It minister KTR commented on conducting mahanadu in gandipet. Chandrababu fearing for farmers and ledies so he came here and conducting mahanadu in Gandipet said KTR.

ఆ భయంతోనే మహానాడు గండిపేటలో పెట్టారా..?

Posted: 05/28/2015 03:13 PM IST
Telangana it minister ktr commented on conducting mahanadu in gandipet

తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడుపై గతంలో చాలా చర్చ జరిగింది. మహానాడు ఎక్కడ నిర్వహించాలి అన్నదానిపై భిన్నవాదనలు వినిపించాయి. కొత్తగా ఏర్పడిని ఏపిలోనే మహానాడు నిర్వహించాలని కొందరు వాదిస్తే.. తెలంగాణలో పార్టీకి బలం రావాలంటే ఇక్కడే నిర్వహించాలి అంటూ తెలంగాణ నేతలు వాదించారు. మొత్తానికి చాలా ఆలోచించిన నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని గండిపేటలో నిర్వహించాలని డిసైడ్ చేశారు. కానీ తాజాగా తెలంగాణ ఐటి మంత్రి కేటీఆర్ మాత్రం గండిపేటలో మహానాడు నిర్వహించడానికి వేరే కారణం చెబుతున్నారు. చంద్రబాబు భయంతోనే గండిపేటలో మహానాడు నిర్వహిస్తున్నారని అంటున్నారు. ఇంతకీ ఆ భయం ఏంటో తెలుసా..?

ఆంధ్రప్రదేశ్లో మహానాడు పెడితే రైతులు, మహిళలు చంద్రబాబుపై తిరగబడతారని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఆ కారణం చేతనే  హైదరాబాద్ నగరంలో టీడీపీ మహానాడు నిర్వహిస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. గురువారం హైదరాబాద్లో కేటీఆర్ మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ను చంద్రబాబే అభివృద్ది చేస్తే తెలంగాణలో టీడీపీ అడ్రస్ లేకుండా ఎందుకు పోయిందని ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. చంద్రబాబు కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చిన వారే అని కేటీఆర్ గుర్తు చేశారు. అలాంటి వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. చంద్రబాబుకే అంత పలుకుబడి ఉంటే గూగుల్ సంస్థను ఏపీలో ఎందుకు విస్తరించలేదని ప్రశ్నించారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gandipet  Mahanadu  TDP  farmers  Chandrababu  Telangana  

Other Articles