Kavitha, MP Kavitha, Nizamabad Mp, Chandrababu, Mahanadu, Recording Dance

Niza abad mp kavitha commented on chandrababu naidu and mahanadu

Kavitha, MP Kavitha, Nizamabad Mp, Chandrababu, Mahanadu, Recording Dance

Niza,abad MP Kavitha commented on chandrababu naidu and Mahanadu. She said that Mahanadu like a recording dance.

టిడిపి మహానాడు రికార్డ్ డ్యాన్స్ లా ఉందా..?

Posted: 05/28/2015 01:16 PM IST
Niza abad mp kavitha commented on chandrababu naidu and mahanadu

రికార్డుల డ్యాన్సుల గురించి మనలో చాలా మందికి తెలిసే ఉంటుంది. చాలా మంది ప్రత్యక్షంగా చూసే ఉంటారు. అయితే తాజాగా నిజామాబాద్ ఎంపీ కవిత రికార్డింగ్ డ్యాన్సులకు తెలుగుదేశం పార్టీకి ముడిపెడుతూ స్టేట్ మెంట్స్ ఇచ్చింది. అదెలా.. రికార్డ్ డ్యాన్సులకు తెలుగుదేశం పార్టీకి ఏంటీ సంబందం అనుకోకండి. ప్రస్తుతం హైదరాబాద్ గండిపేటలో జరుగుతున్న తెలుగుదేశం పార్టీ మహానాడు అచ్చం రికార్డింగ్ డ్యాన్స్ ను తలపిస్తోంది అంటూ ఆమె పోల్చారు. అంటే పండగలకు వేసుకున్న రికార్డు డ్యాన్సుల్లా ఉంది టిడిపి మహానాడు అనే అర్థంలో మాట్లాడారు కవిత. నిన్నటి మహానాడులో ఉపన్యసించిన నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ, హైదరాబాద్ అభివృద్ది చేసింది తానేనని చెప్పారు. అయితే ఎంపీ కవిత ఆ వ్యాఖ్యలపై స్పందించారు.

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు టీఆర్ఎస్ నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత సవాల్ విసిరారు. హైదరాబాద్ అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ఆమె గురువారమిక్కడ స్పష్టం చేశారు. హైదరాబాద్లో భూములు అమ్మింది ఎవరో, అభివృద్ధి చేసింది ఎవరో తేల్చాలని కవిత డిమాండ్ చేశారు. ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్ను స్వీకరించాలని ఆమె అన్నారు.మనుషులను చంపటం...ఆ తర్వాత మాలలు వేయటం చంద్రబాబు నాయుడుకు అలవాటేనని, అలాగే అమరవీరుల చావుకు కారణమైన ఆ పార్టీ ... ఇప్పుడు వారి గురించి మాట్లాడటం విడ్డూరమన్నారు. మొత్తానికి మొన్న అన్న కేటీఆర్ చంద్రబాబు మీద విరుచుకుపడితే.. ఆ రోజు కవిత చంద్రబాబు మీద విరుచుకుపడ్డారు. మొత్తానికి అన్నాచెల్లెల్లు చంద్రబాబునే టార్గెట్ చేశారు.

*అభినవచారి*

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kavitha  MP Kavitha  Nizamabad Mp  Chandrababu  Mahanadu  Recording Dance  

Other Articles